కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై ఇవాళ సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. వైఎస్ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టు లో సవాల్ చేశారు.
న్యూఢిల్లీ: ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరో వైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను ఈ ఏడాది జూన్ 30 వ తేదీ వరకు పొడిగించింది.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై వైఎస్ సునీతారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు సోమవారంనాడు విచారించింది. ఈ పిటిషన్ పై ఈ నెల 21న సుప్రీంకోర్టు విచారించింది. ఈ పిటిషన్ పై విచారణను ఇవాళ కొనసాగిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని వైఎస్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ మేరకు ఈ నెల 20వ తేదీన వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇవాళ ఈ విషయమై సుప్రీంకోర్టులో సుదీర్థ వాదనలు జరిగాయి. 24 గంటల పాటు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబఐకి ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని కోరారు. అయితే అవినాష్ రెడ్డి ని సీబీఐ అరెస్ట్ చేస్తుందని మీరు భావిస్తున్నారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయదలుచుకుంటే ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండేదని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో సీబీఐ పూర్తి సంయనంతో ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ముందస్తు బెయిల్ అంశాన్ని తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
మరో వైపు వైఎస్ అవినాష్ రెడ్ ముందస్తు బెయిల్ అంశానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది. అవినాష్ రెడ్డిని విచారించే సమయంలో లిఖితపూర్వకంగా ప్రశ్నలు ఇవ్వాలని సీబీఐకి తెలంగాణ హైకోర్టు చేసిన సూచనను సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ గడువును పొడిగించాలని గత వాయిదాలోనే సీబీఐ కోరింది. గడువును పొడిగిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఈ విషయమై ఇవాళ సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది.
also read:వైఎస్ అవినాష్ రెడ్డికి షాక్: మధ్యంతర బెయిల్ పై తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడాన్ని వైఎస్ సునీతారెడ్డి ఈ నెల 20వ తేదీన సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.
అత్యవసరంగా విచారించాలని వైఎస్ సునీతా రెడ్డి కోరారు. దీంతో ఈ నెల 21న ఈ విషయమై సుప్రీంకోర్టు విచారించింది. వైఎస్ అవినాష్ రెడ్డికి ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది. ఈ పిటిషన్ పై విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవాళ మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి వాదనలు ప్రారంభమయ్యాయి. సుదీర్థ వాదనలు విన్న తర్వాత సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
