Asianet News TeluguAsianet News Telugu

ఎన్‌జీటీ తీర్పు : సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వానికి చుక్కెదురు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయ వేసింది. పురుషోత్తమపట్నం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరమన్న ఎన్‌జీటీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఎన్‌జీటీ తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. 

supreme court socks andhra pradesh govt over SGT verdict - bsb
Author
Hyderabad, First Published Feb 1, 2021, 1:30 PM IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయ వేసింది. పురుషోత్తమపట్నం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరమన్న ఎన్‌జీటీ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఎన్‌జీటీ తీర్పులో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. 

పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకంపై ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీని మీద జస్టిస్ రోయింగ్ టన్ నారీమన్, జస్టిస్ అనిరుధ్ బోస్‌ల బెంచ్ విచారణ జరిపింది. 

పురుషోత్తమ పట్నం ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టు కాదని ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ లాయర్ వెంకట రమణి వాదనలు వినిపించారు. పురుషోత్తమ పట్నం ప్రాజెక్టు ద్వారా పోలవరం ప్రాజెక్టు ఆయకట్టుకు నీరు ఇస్తామని వివరించారు. 

ఈ ప్రాజెక్టుతోనే విశాఖ నగరానికి తాగునీరు అందుతుందని, కొత్త ఆయకట్టు లేని ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని న్యాయవాది వ్యాఖ్యానించారు. దీనికి వ్యతిరేకంగా బాధిత రైతుల తరుఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. 

పోలవరం ప్రాజెక్టుకు 2006లో 2006లో పర్యావరణ అనుమతులు రాగా, పురుషోత్తమ పట్నం ప్రాజెక్టు పనులు 2016-17 లో చేపట్టారని వివరించారు.  పురుషోత్తమ పట్నం ప్రాజెక్టు విషయంలో పర్యావరణ, సామాజిక ప్రభావాలను అధ్యయనం చేయలేదని వివరించారు. 

రైతుల నుంచి తీసుకున్న భూములకు పరిహారం ఇంకా ఇవ్వలేదని కోర్టుకు వివరించారు. ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం ఎన్‌జీటీ ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. 

Follow Us:
Download App:
  • android
  • ios