Asianet News TeluguAsianet News Telugu

YS Jagan Mohan Reddy బెయిల్ రద్దుకై రఘురామ పిటిషన్: జగన్ సహా ప్రతివాదులకు సుప్రీం నోటీసులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వైఎస్ఆర్‌సీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ పై  సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.

Supreme court issues notice to Andhra Pradesh CM YS Jagan and others on Raghurama krishnam raju petition lns
Author
First Published Nov 24, 2023, 12:26 PM IST

న్యూఢిల్లీ:ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి    బెయిల్ ను రద్దు చేయాలని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్‌సీపీ) ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన  పిటిషన్ పై సుప్రీంకోర్టు  శుక్రవారంనాడు  కీలక నిర్ణయం తీసుకుంది.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ప్రతివాదులకు  నోటీసులు  జారీ చేసింది.  

ఆస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై వైఎస్ఆర్‌సీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీఎం జగన్  సహా ప్రతివాదులకు  సుప్రీం నోటీసులు జారీ చేసింది.  వచ్చే ఏడాది జనవరికి  కేసు విచారణ వాయిదా వేసింది సుప్రీం కోర్టు.రఘురామకృష్ణం రాజు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. గతంలో రఘురామకృష్ణం రాజు తెలంగాణ హైకోర్టులో  దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు  కొట్టివేసింది. దీంతో రఘురామకృష్ణం రాజు  సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

జగన్ పై దాఖలైన దాఖలైన సీబీఐ కేసుల విచారణను ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని  రఘురామకృష్ణం రాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.ఈ పిటిషన్ లో కూడ జగన్ కు  సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసుతో పాటు ఆస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు కోరుతూ  దాఖలు చేసిన పిటిషన్ ను కలిపి విచారించాలని  సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే  ఈ రెండు కేసులు వేర్వేరని రఘురామకృష్ణం రాజు  తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.జగన్ బెయిల్ ను ఈడీ, సీబీఐ సవాల్ చేయని విషయాన్ని కూడ ప్రస్తావించారు. దీంతో  జగన్ సహా  ప్రతివాదులకు  నోటీసులు జారీ చేశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios