తిరుపతి కేంద్రంగా ఏర్పాటు కానున్న శ్రీ బాలాజీ జిల్లా కలెక్టరేట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్ట్ కొట్టివేసింది. పద్మావతి నిలయంలోనే కలెక్టరేట్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది.
కొత్త జిల్లాల ఏర్పాటుకు (ap new districts) సంబంధించి వైఎస్ జగన్ సర్కార్ (ys jagan govt) వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఈ క్రమంలో తిరుపతి కేంద్రంగా ఏర్పాటు కానున్న శ్రీ బాలాజీ జిల్లా కలెక్టరేట్‌కు (sri balaji district) ఎదురవుతున్న అవరోధాలు తొలగిపోయాయి. పద్మావతి నిలయంలోనే (padmavathi nilayam tirupati) బాలాజీ జిల్లా కలెక్టరేట్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు పద్మావతి నిలయంలో బాలాజీ జిల్లా కలెక్టరేట్ ఏర్పాటును అడ్డుకోవాలంటూ బీజేపీ నేత, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం బుధవారం కొట్టేసింది.
తిరుపతి పరిధిలోని తిరుచానూరులో టీటీడీ నిధులతో నిర్మించిన పద్మావతి నిలయాన్ని శ్రీ బాలాజీ జిల్లా” నూతన కలెక్టరేట్ కార్యాలయంగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం విచారణ జరపనుంది. పద్మావతి నిలయంలోనే బాలాజీ జిల్లా కలెక్టరేట్ ఏర్పాటుకు (sri balaji district collectorate) హైకోర్టు అనుమతిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించాలని దాఖలైన ఈ పిటిషన్ అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని న్యాయస్థానం పేర్కొంది.
కలెక్టరేట్ కార్యాలయం రావడం వల్ల ఆ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కలెక్టర్ చెట్టు కింద కూర్చుని పనిచేయలేరు కదా అని వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి సముచిత గౌరవం ఇవ్వాలని సుప్రీం వెల్లడించింది. జిల్లాల పునర్విభజన చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని న్యాయస్థానం పేర్కొంది.
కాగా.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల అవతరణకు ముహుర్తం ఖరారు అయింది. ఏప్రిల్ 4వ తేదీన సీఎం జగన్ చేతుల మీదుగా కొత్త జిల్లాల ప్రారంభోత్సవం జరగనుంది. ఆ రోజు నుంచే కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభం కానుంది. ఉదయం 9.05 గంటల నుంచి 9.45 గంటల మధ్య కొత్త జిల్లాల అవతరణ కార్యక్రమం జరగనుంది. తొలుత కొత్త జిల్లాల నుంచి ఉగాది రోజున పాలన ప్రారంభించాలని భావించారు. అయితే ముహుర్తం, ఇతర అంశాలను పరిగణలోని తీసుకున్న ప్రభుత్వం.. ఏప్రిల్ 4వ తేదీన కొత్త జిల్లా ప్రారంభోత్సం జరపాలని నిర్ణయించింది.
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లా ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 26 జిల్లాలకు కేబినెట్ వర్చువల్ విధానంలో ఆమోద ముద్ర వేసింది. కొత్తగా పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య, నంద్యాల, సత్యసాయి, ఎన్జీఆర్ విజయవాడ జిల్లాలు అమలులోకి రానున్నాయి. కొత్తగా 22 రెవెన్యూ డివిజిన్లను ఏర్పాటు చేయనున్నారు. పలాస, బొబ్బిలి, చీపురుపల్లి, భీమిలి, కొత్తపేట, భీమవరం, ఉయ్యూరు, తిరువూరు, నందిగామ, బాపట్ల, చీరాల, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, గుంతకల్, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, పలమనేరు, కుప్పం, నగరి, శ్రీకాళహస్తిలు కొత్త రెవెన్యూ డివిజన్లుగా ఏర్పాటు చేయనున్నట్టుగా సమాచారం.
