ఏపీ ఫైబర్‌నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు జనవరి 17కు వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ అనురుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.  

ఏపీ ఫైబర్‌నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు జనవరి 17కు వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ప్రభుత్వానికి సుప్రీం సూచించింది. అలాగే కేసు విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని చంద్రబాబుకు కూడా సూచించింది. ఇరుపక్షాలు సంయమనం పాటించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈ మేరకు జస్టిస్ అనురుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. 

కాగా.. ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై గత నెల 30 విచారణ జరిపిన ధర్మాసనం తదుపరి విచారణను డిసెంబర్ 12కు వాయిదా వేసింది. 17ఏ పై చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు పెండింగ్‌లో వున్నందున ఈ అంశంపై తీర్పు వచ్చాకే ఫైబర్‌నెట్ కేసులోనూ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారిస్తామని అప్పుడే స్పష్టం చేసింది.