విజయవాడ : వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మను చూస్తుంటే గాంధారి గుర్తుకు వస్తున్నారంటూ ఏపి కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు, అమరావతి మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ సంచలన కామెంట్స్ చేశారు. 

ఆ గాంధారి తన భర్త చూడని లోకం తాను చూడనని కళ్ళకు గంతలు కట్టుకుంటే విజయమ్మ తన పిల్లలు చేస్తున్న అరాచకాలు కళ్లుండి చూడకుండా గాంధారిలా మారారని విమర్శించారు.

తన కుమార్తె షర్మిల రెండు రోజులు దీక్ష చేస్తే ప్రభుత్వం దిగివచ్చి సమాధానం చెప్పాలని అంటున్నారు. ఏపీ ప్రజల భవిష్యత్ కోసం, అమరావతి రాజధాని నిర్మాణం కోసం 34000 ఎకరాలు  భూములు ఇచ్చిన రైతులు మీ పుత్రరత్నం వల్ల దాదాపు 490  రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. అప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు.

అమరావతి మహిళలను పోలీసులతో మీ కొడుకు రక్తం వచ్చేలా కొట్టిస్తే ఎక్కడున్నవమ్మా విజయమ్మ ? షర్మిల ఒక్కరేనా మహిళా ? అమరావతి మహిళా రైతులు మహిళలు కాదా  ? కడుపుతీపి మీ ఒక్కరికే ఉంటుందా ? అంటూ ఎద్దేవా చేశారు. 

పథకాల పేరుతో జగన్.. ప్రజల్ని దోపిడీ చేస్తూ జేబులు నింపుకుంటున్నాడు.. గోరంట్ల...

వైజాగ్ ఎంపీగా పోటీ చేసిన మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తుంటే నోరు మెదపడం లేదు ఎందుకు? మూడు రాజధానుల పేరుతో అమరావతి, విశాఖను నాశనం చేయడం తప్పు అని ఎప్పుడైనా జగన్ కి మీరు చెప్పారా ? అని అడిగారు. 

జగన్ కి ఒక్క అవకాశం ఇవ్వండి.. అని ఊరు, వాడా తిరిగిన మీరు, షర్మిల ఎందుకు మౌనంగా ఉంటున్నారు. అన్న ఏపీని నాశనం చేస్తుంటే చెల్లి తెలంగాణను నాశనం చేయడానికి సిద్ధం అవుతుందన్నారు. విజయమ్మ, జగన్, షర్మిల కలిసి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును బ్రష్టు పట్టిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.