సూళ్లూరుపేట అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో వున్న సూళ్లూరుపేట.. జిల్లాల పునర్విభజన తర్వాత తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చింది. సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,37,796 మంది. వీరిలో పురుషులు 1,15,896 మంది.. మహిళలు 1,21,878 మంది. భారత అంతరిక్ష పరిశోధనా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కూడా ఈ సెగ్మెంట్ పరిధిలోకే వస్తుంది.  

Sullurpeta Assembly elections result 2024 AKP

ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కీలక నియోజకవర్గం సూళ్లురుపేట. బంగాళాఖాతానికి , పులికాట్ సరస్సుకు ఆనుకుని వుంటూ జీవ వైవిధ్యానికి కూడా పెట్టింది పేరు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో వుండే ఈ సెగ్మెంట్‌లో రెండు ప్రాంతాల సంస్కృతి, సాంప్రదాయాలు సూళ్లూరుపేటలో వుంటాయి. భారత అంతరిక్ష పరిశోధనా శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కూడా ఈ సెగ్మెంట్ పరిధిలోకే వస్తుంది. ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో వున్న సూళ్లూరుపేట.. జిల్లాల పునర్విభజన తర్వాత తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చింది. సూళ్లూరుపేట నియోజకవర్గం పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,37,796 మంది. వీరిలో పురుషులు 1,15,896 మంది.. మహిళలు 1,21,878 మంది. 

టీడీపీ, కాంగ్రెస్‌లకు కంచుకోట :

1962లో జనరల్ నియోజకవర్గంగా ఏర్పాటైన సూళ్లూరుపేట తర్వాత 2009లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మారింది. సూళ్లూరుపేట నియోజకవర్గం తొలినాళ్లలో కాంగ్రెస్‌కు ఆ తర్వాత టీడీపీకి కంచుకోటగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ 5 సార్లు , వైసీపీ రెండు సార్లు గెలిచాయి. రెడ్డి, శెట్టి బలిజ, దళిత వర్గాల ఓటు బ్యాంక్ సూళ్లూరుపేటలో అధికం. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి కిలివేటి సంజీవయ్య 1,19,627 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి పారాస వెంకట రత్నంకు 58,335 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 61,292 ఓట్ల భారీ మెజారిటీతో సంచలన విజయం సాధించింది.

 హ్యాట్రిక్‌పై వైసీపీ కన్ను :

2024 ఎన్నికల విషయానికి వస్తే వైసిపి మరోసారి సంజీవయ్యకే టికెట్ కేటాయించారు. టీడీపీ  నెలవల విజయశ్రీకి సూళ్లూరుపేట టికెట్ కేటాయించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios