ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కవిటంలో ప్రేమోన్మాది  దారుణానికి పాల్పడ్డాడు. రెండో పెళ్లికి ఒప్పుకోలేదని యువతిపై కత్తితో విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో ఆ  యువతి  పరిస్థితి విషమంగా ఉంది.యువతిపై దాడికి పాల్పడిన  నిందితుడు ఆ తర్వాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం కవిటంలో సుధాకర్ రెడ్డి అనే వ్యక్తికి పెళ్లైంది. అయితే తేజస్వినిని రెండో పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చాడు.ఆ  యువతి పెళ్లికి ఒప్పుకోలేదు. బుధవారం నాడు ఉదయం తేజస్వి కాలేజీకి వెళ్లున్న సమయంలో  సుధాకర్ రెడ్డి ఆమెపై కత్తితో దాడికి దిగాడు.

ఈ  సమయంలో స్థానికులు సుధాకర్ రెడ్డిని అడ్డుకొన్నారు. అయినా కూడ ఆమెపై దాడి చేశాడు.  ఈ క్రమంలో తేజస్వినికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటోలో బాధితురాలనిని పాలకొల్లు ఆసుపత్రికి తరలించారు.

సుధాకర్ రెడ్డిని స్థానికులు తేజస్వినిపై దాడి చేయకుండా కట్టేసి అడ్డుకొన్నారు. పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. ఈ సమయంలోనే సుధాకర్ రెడ్డి ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సుధాకర్ రెడ్డిని కూడ పాలకొల్లు ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. 

సుధాకర్ రెడ్డి కత్తితో దాడి చేయడంతో  తేజస్విని ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. ఆమెకు తీవ్ర రక్తస్రావమైంది. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. తేజస్విని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇదే ఆసుపత్రిలో సుధాకర్ రెడ్డికి కూడ చికిత్స అందిస్తున్నారు. 

సుధాకర్ రెడ్డికి వివాహామై భార్య కూడ ఉంది. అయితే తేజస్వినిని రెండో పెళ్లి చేసుకోవాలని చాలా కాలంగా ఒత్తిడి తెస్తున్నట్టుగా సమాచారం. అయితే ఆమె ఈ విషయమై నిరాకరించింది. సుధాకర్ రెడ్డి నుండి రక్షించాలని కోరుతూ తేజస్విని పరుగెత్తింది. దీంతో స్థానికులు ఆమెను కాపాడారు. సుధాకర్ రెడ్డి స్థానికులను తప్పించుకొని తేజస్వినిపై దాడి చేశాడు.

సుధాకర్ రెడ్డి వేధింపులకు గురిచేస్తున్నా తేజస్విని భరించింది. కానీ, ఈ విషయమై ఆమె బయటకు చెప్పలేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. సుధాకర్ రెడ్డిని స్థానికులు తాళ్లతో కట్టేసే సమయంలో సుధాకర్ రెడ్డి భార్య వచ్చి అతడి చేతిలో నుండి కత్తిని లాగేసుకొన్నట్టుగా స్థానికులు చెప్పారు. ఈ ఘటనపై  బాధిత యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సుధాకర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. కాలేజీక వెళ్లే సమయంలో ఈ దారుణానికి పాల్పడినట్టుగా స్థానికులు తమకు సమాచారం ఇచ్చారని కుటుంబసభ్యులు  తెలిపారు. సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో ఆటోలోనే స్థానికులు తేజస్వినిని పాలకొల్లు ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత సుధాకర్ రెడ్డిని కూడ ఆటోలోనే అదే ఆసుపత్రికి తరలించారు.