తూర్పు గోదావరి జిల్లా రాజానగరం గైట్ కాలేజీ వద్ద విద్యార్ధులు, భద్రతా సిబ్బందికి మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఫెస్ట్ కి అనుమతించకపోవడంతో విద్యార్ధులు సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి దిగారు.
రాజానగరం: East Goadvari జిల్లా రాజా నగరం GIET College వద్ద Students , Security సిబ్బందికి మధ్య ఆదివారం నాడు ఘర్షణ చోటు చేసుకొంది. కాలేజీలోకి అనుమతించకపోవడంతో విద్యార్ధులు కాలేజీ సెక్యూరిటీపై దాడికి దిగారు.
కాలేజీలో జరిగే Fest కి తమను అనుమతించలేదని విద్యార్ధులు ఆందోళనకు దిగారు. కొందరు విద్యార్ధులు సెక్యూరిటీ సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఒక విద్యార్ధి ఏకంగా కోపంతో ఊగిపోతూ కర్రతో సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి దిగారు.ఈ పరిణామానికి షాక్ కి గురైన సెక్యూరిటీ విద్యార్ధిని అడ్డుకొన్నారు. అయినా కూడా అతను కర్రతో దొరికిన వారిని దొరికినట్టుగా చితకబాదాడు.
