కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో ఎంతోమంది ఉపాధి లేక విలవిలలాడుతున్నారు. ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టి, తినడానికి తిండి లేక ఇక్కట్ల పాలవుతున్నారు.

ఈ నేపథ్యంలో గుంటూరులో షేక్‌ జాన్‌బాబు అనే ఓ నూడిల్స్ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‌లాక్‌డౌన్ కారణంగా దాదాపు రెండు నెలల నుంచి అతను జీవనోపాధి కోల్పోయాడు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఇంటి అద్దె చెల్లించాల్సిందిగా యజమాని బాధితుడిపై ఒత్తిడి తీసుకొచ్చాడు.

అతని వేధింపులు భరించలేకపోయిన జాన్ బాబు మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అద్దె కట్టలేక ఇంటిని ఖాళీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ.. అద్దె బాకీ చెల్లించిన తర్వాతే సామాన్లు తీసుకువెళ్లాలని యజమాని తేల్చిచెప్పడంతో మానసిక వ్యధకు లోనై జాన్ బాబు ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు ఆరోపిస్తున్నారు.
 

Also Read:

గుంటూరు జిల్లాలో హైఅలర్ట్... పెరిగిన కటైన్మెంట్ జోన్లు, జాబితా ఇదే

ముంబై వలస కూలీల దెబ్బ: కరోనాతో వణుకుతున్న కోనసీమ