సారాంశం
కర్నూలు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో(srisailam temple) సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న కొందరు సెక్యూరిటీ గార్డులు (security guards) పాడు పనులు చేస్తున్నారు. లైంగిక వాంఛ తీర్చాలని అమ్మాయిలపై వేధింపులకు పాల్పడుతున్నారు.
కర్నూలు జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయంలో(srisailam temple) సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న కొందరు సెక్యూరిటీ గార్డులు (security guards) పాడు పనులు చేస్తున్నారు. అమ్మాయిలను వేధించడమే కాకుండా.. తమ లైంగిక వాంఛ తీర్చాలని బెదిరింపులకు పాల్పడుతున్నారు. శ్రీశైలం, సున్నిపెంటకు చెందిన విద్యార్థినిల మెయిల్ ఐడీలు హ్యాక్ చేసి, ఫేస్‌బుక్‌లో యువతుల ఫోటోలు సేకరించి వారిని వేధిస్తున్నారు. వ్యక్తిగత ఫోటోలతో అమ్మాయిలకు వలవేసి, లైంగిక వాంఛలు తీర్చాలని బెదిరింపులకు దిగారు. డబ్బు ఆశ కూడా చూపుతున్నారు.
ఇందుకు సంబంధించిన కొన్ని ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్నారు. బాధితుల్లో పలువురు విద్యార్థినిలు, మహిళలు ఉన్నారు. ఓ సెక్యూరిటీ గార్డు సెల్‌ఫోన్‌లో వేలకొద్ది అమ్మాయిలు, మహిళల ఫోటోలు ఉన్నట్లుగా సమాచారం. నలుగురు ఒక ముఠాగా ఏర్పడి ఈ పాడు పనులకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఓ అమ్మాయి కూడా వీరికి సహకరిస్తున్నట్టుగా అనుమానిస్తున్నారు.
అయితే బెదిరింపుల కారణంగా బాధితులు బయటకు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికైనా శ్రీశైలం దేవస్థానం అధికారులు వెంటనే స్పందించి వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
కూకట్‌పల్లిలో రేవ్ పార్టీ..
హైదరాబాద్ (Hyderabad) కూకట్‌పల్లిలో నిర్వహించిన రేవ్ పార్టీని (Rave Party in kukatpally) పోలీసులు భగ్నం చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు 44 మంది స్వలింగ సంపర్కులతో పాటు ఇద్దరు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. కూకట్ పల్లి వివేక్ నగర్‌లోని ఓ ఇంటిపై స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. అయితే అక్కడ కనిపించిన దృశ్యాలను చూసి పోలీసులు షాక్ అయ్యారు. అక్కడ పెద్ద సంఖ్యలో స్వలింగ సంపర్కులు.. మద్యం, హుక్కా సేవించి నృత్యాలు చేస్తున్నట్టుగా గుర్తించారు. ప్రతి వీకెండ్‌లో వారు ఇలాంటి పార్టీలు చేస్తున్నట్టుగా తేల్చారు.
ఈ పార్టీలు నిర్వహిస్తున్న ఇమ్రాన్, దయాల్‌పై కేసు నమోదు చేశారు. ఈ పార్టీకి సందబంధించి స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. 44 మంది స్వలింగ సంపర్కులతో పాటు ఇద్దరు హిజ్రాలను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ పెద్ద మొత్తంలో మద్యం బాటిల్స్, కండోమ్స్ ప్యాకెట్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వలింగ సంపర్కులను కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.