లేఖలో పేర్కొన్నవన్నీ అసత్యాలే.. పక్క రాష్ట్రంలో దాక్కొని విమర్శలా: బాబుపై శ్రీకాంత్ రెడ్డి విమర్శలు
టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేతపై వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఇంట్లో కూర్చొని చంద్రబాబు దిక్కుమాలిన లేఖలు రాస్తున్నారని ఆయన విమర్శించారు
టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేతపై వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఇంట్లో కూర్చొని చంద్రబాబు దిక్కుమాలిన లేఖలు రాస్తున్నారని ఆయన విమర్శించారు.
ఎవరో తాడేదారుడు రాసిన లేఖపై చంద్రబాబు సంతకం చేసినట్లు ఉందని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. బాబు లేఖలో పేర్కన్నవన్ని అబద్ధాలే అని.. ఆ లేఖలో ఉపయోగపడే అంశాలు ఏమి లేవని ఆయన విమర్శించారు.
చంద్రబాబు, ఆయన కుమారుడు హైదరాబాద్‌లో కూర్చొని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవగాహన లేకుండా రైతుల గురించి మాట్లాడితే ప్రజలు నవ్వుతారని, ప్రతిపక్షనేత హైదరాబాద్‌లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడని ఆయన ధ్వజమెత్తారు.
Also Read:అమెరికా నుండి పోస్టు ద్వారా గంజాయి: తెలుగోడి ఘనకార్యం!
టీడీపీ అధినేత ప్రజలను లాక్‌డౌన్ పాటించమని చెబుతున్నాడని, కానీ ఆయన కుమారుడు రోడ్లు మీద షికార్లు చేస్తున్నాడని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. కనీసం మొహానికి మాస్క్ కూడా లోకేశ్ ధరించలేదని దుయ్యబట్టారు.
చంద్రబాబు మౌత్ పీస్ కన్నా లక్ష్మీనారాయణ అని, శవాలు మీద పేలాలు ఎరుకునే రకం టీడీపీ నేతలని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ర్యాపిడ్ టెస్ట్ కిట్లను ప్రభుత్వం పారదర్శకంగా కొనుగోలు చేసిందని ఆయన గుర్తుచేశారు.
నాయకత్వం అంటే బిల్డప్‌లు ఇవ్వడం కాదని, పాత ఫోటోలతో ప్రజలను చంద్రబాబు మభ్యపెడుతున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా పీజ్ రీయంబర్స్‌మెంట్ కోసం రూ.4 వేల కోట్లు కేటాయించామని శ్రీకాంత్ రెడ్డి గుర్తుచేశారు.
చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోయినప్పటికీ సీఎం సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని ఆయన ప్రశంసించారు. కరోనా కట్టడిలో దేశానికి ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని ఆయన గుర్తుచేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు సైతం అనేక సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ప్రశంసించారు. అలాంటి నేతల వల్లనే కరోనా వచ్చిందని మాట్లాడటం చంద్రబాబు నీచ రాజకీయాలని నిదర్శనమని ఆయన ఆరోపించారు.
Also Read:హెరిటేజ్ పాలు లీటరుకు రూ.4 పెంపు, బాబు కంటే రాబందులే నయం: ఎంపీ బాలశౌరి
దళితుడైన కనగరాజును ఎన్నికల కమీషనర్‌గా నియమిస్తే చంద్రబాబు తట్టుకోలేకపోయిన ప్రతిపక్షనేత రాజ్‌భవన్‌లో కరోనా వచ్చిందని అసత్య ప్రచారం చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా వస్తే చనిపోరని సీఎం జగన్ ప్రజలకు ధైర్యం చెబుతున్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు పక్క రాష్ట్రంలో దాక్కొని విమర్శలు చేస్తున్నారని, ప్రజలపై అభిమానం ఉంటే బాబు రాష్ట్రానికి రావాలని శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు.