విజయవాడనుంచి రద్దైన స్పైస్ జెట్ సర్వీసులు.. నేటినుంచే అమల్లోకి..

ఇవాల్టి నుంచే (శుక్రవారం) సర్వీసుల రద్దు అమలులోకి వచ్చిందని తెలిపింది. ఇప్పటికే ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయాలు నిలిపివేశారు. సర్వీసుల విషయంపై గన్నవరం విమానాశ్రయం అధికారులకు యాజమాన్యం సమాచారం అందించింది.

Spice Jet Airways Cancel Flight Services in Gannavaram Airport

విజయవాడ నుంచి స్పైస్జెట్ విమాన సేవలు నిలిచిపోయాయి. ప్రయాణికుల రద్దీ తగ్గిన కారణంగా అక్టోబర్ వరకు సర్వీసులు నిలిపివేస్తున్నామని స్పైస్జెట్ సంస్థ తెలిపింది.  విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సేవలు నిలిచిపోయాయి.  అక్టోబరు వరకు విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు స్పైస్జెట్ సంస్థ ప్రకటించింది.

ఇవాల్టి నుంచే (శుక్రవారం) సర్వీసుల రద్దు అమలులోకి వచ్చిందని తెలిపింది. ఇప్పటికే ఆన్లైన్లో టిక్కెట్ల విక్రయాలు నిలిపివేశారు. సర్వీసుల విషయంపై గన్నవరం విమానాశ్రయం అధికారులకు యాజమాన్యం సమాచారం అందించింది.

ఇప్పటివరకు విజయవాడ నుంచి బెంగళూరుకు సర్వీసులు నడుస్తున్నాయి. రద్దీ తగ్గడం, ఇతర కారణాల వల్ల సర్వీసులు రద్దు చేసినట్లు స్పైస్జెట్ ప్రకటించింది. ప్రస్తుతం స్పైస్ జెట్ విజయవాడ నుంచి కేవలం ఒక నగరానికి మాత్రమే సర్వీసులు నడుపుతుంది. గతంలో విజయవాడ నుంచి చెన్నై, విశాఖపట్నం, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు సర్వీసులను నడిపేది. 

అయితే కరోనా నేపథ్యంలో...ప్రయాణికులు తగ్గిపోయారు అన్న కారణాలతో దశల వారీగా ఒక్కో నగరానికి విమాన సర్వీసులను రద్దు చేస్తూ వచ్చింది. ప్రస్తుతం పూర్తిగా విమానాశ్రయం నుంచి స్పైస్జెట్ సర్వీసులు నిలిచిపోయాయి. గన్నవరం నుంచి ఎయిర్ ఇండియా, ఇండిగో, ట్రూ జెట్ విమానాలు మాత్రమే ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. 

గన్నవరం నుంచి నడుస్తున్న సర్వీసుల్లో ప్రయాణికుల రద్దీ, ఇతర కారణాల వల్ల సర్వీసులు నిలిపివేస్తున్నట్లు స్పైస్ జెట్ సంస్థ తెలిపింది. సెప్టెంబర్ తర్వాత పరిస్థితులను బట్టి విమాన సర్వీసులను పునరుద్ధరించే నిర్ణయం తీసుకుంటామని సంస్థ పేర్కొంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios