ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోకి  నైరుతి రుతుపవనాలు  ప్రవేశించాయి.   ఏపీ నుండి తెలంగాణ రాష్ట్రంలోకి  నైరుతి రుతుపవనాలు  ప్రవేశించాయి. 

. అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఆదివారం నాడు ప్రవేశించాయి. మూడు రోజుల క్రితం నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రాన్ని తాకాయి. వారం రోజులు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. 20 ఏళ్ల తర్వాత వారం రోజులు ఆలస్యంగా కేరళ రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించాయి.
కేరళ రాష్ట్రం నుండి దేశ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయి. 

also read:చల్లటి కబురు: కేరళను తానికి నైరుతి రుతుపవనాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీహరికోట నుండి ఏపీ రాష్ట్రంలోకి ప్రవేశించాయి. తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి లో కూడ నైరుతి రుతుపవనాలు విస్తరించాయి,. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులున్నాయని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాల కారణంగా ఏపీ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి వివరించింది. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలతోనే సమృద్దిగా వర్షాలు కురుస్తాయి. నైరుతి రుతుపవనాల రాకతో వేసవి తీవ్రత తగ్గనుంది. సాధారణంగా మే 31 లేదా జూన్ 1వ తేదీన నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. అయితే ఈ ఏడాది వారం రోజులు ఆలస్యంగా కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించాయి.