Asianet News TeluguAsianet News Telugu

మందలించారని తల్లిపై దాడి, తండ్రిని చంపి.. గుంతలో పాతిపెట్టే ప్రయత్నం...

వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ కొడుకే వారి పాలిట కాలయముడిగా మారాడు. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కలకలం రేపింది.  

son attacked elderly parents and father dead in nellore - bsb
Author
Hyderabad, First Published May 22, 2021, 12:16 PM IST

వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ కొడుకే వారి పాలిట కాలయముడిగా మారాడు. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కలకలం రేపింది.  

పక్షవాతంతో మంచంలో ఉన్న తండ్రితో పాటు తల్లి పై ఓ కొడుకు కిరాతకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తండ్రి మృతి చెందగా, తల్లి తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స  పొందుతోంది. ఈ దారుణం చేజర్ల మండలం కండాపురంలో శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది.

అందిన వివరాల మేరకు... గ్రామానికి చెందిన కోలా శ్రీనివాసులు (70), శివరామమ్మ దంపతులు. వీరికి కోటేశ్వరరావు అనే కుమారుడు ఉన్నాడు. ఇతను ఏ పని చేయకుండా, జులాయిగా తిరుగుతూ ఉండేవాడు. ఈ విషయమై పలుమార్లు తండ్రి ప్రశ్నిస్తూ ఉండడంతో పాటు.. ఏదైనా పని చూసుకోవాలని చెబుతూ ఉండేవాడు.

ఇది నచ్చని కోటేశ్వరరావు తండ్రితో వాదనకు దిగేవాడు. అయితే శ్రీనివాసులుకు నాలుగేళ్ల క్రితం పక్షవాతానికి గురి కావడంతో వ్యవసాయ పనులు చేయలేక ఇంటికే పరిమితమయ్యాడు.  ఈ నేపథ్యంలో శుక్రవారం మధ్యాహ్నం 1:00 సమయంలో ఇంటికి వచ్చిన కోటేశ్వరరావు తండ్రి తో మరోసారి గొడవకు దిగాడు. 

అదే కోపంతో కత్తితో మంచం పై ఉన్న తండ్రి పై దాడికి పాల్పడ్డాడు. అడ్డుకోబోయిన తల్లి శివరామమ్మ చేతులపై గాయపరిచాడు. కొడుకు దాడిలో తండ్రి తలకు తీవ్ర గాయమైన శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. 

రాజమండ్రిలో మరో ఆనందయ్య: కరోనాకు వసంత కుమార్ మందు...

కాగా ఈ విషయం సాయంత్రం వరకు వెలుగులోకి రాలేదు. అయితే తండ్రి మృతదేహాన్ని పూడ్చి పెట్టేందుకు కోటేశ్వరరావు గ్రామ పొలిమేరలో గుంత తవ్వేందుకు ప్రయత్నిస్తుండగా చుట్టుపక్కల వారు అనుమానించారు.

విషయమేంటని ఆరాతీయగా తండ్రి చనిపోయిన సంగతి వెలుగులోకి వచ్చింది. దాంతో సమాచారాన్ని పోలీసులకు అందించారు. రాత్రి ఎనిమిది గంటల సమయంలో సీఐ, ఎస్సై లు గ్రామానికి వెళ్లి విచారణ చేశారు. 

మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నెల్లూరుకు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని పొదలకూరు సిఐ ఎం.గంగాధర్, చేజర్ల ఎస్ఐ ఎస్.కె  ఎండీ హనీఫ్ అని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios