Amaravati: మద్యానికి బానిసైన నిందితుడు వెంకటేశ్వర్లు 14 ఏళ్ల క్రితం 2006లో తండ్రిని హత్య చేసి నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. అయినా మార్పు రాకపోవడంతో పాటు మ‌ద్యానికి బానిస‌య్యాడు. ఈ క్ర‌మంలోనే పింఛన్ డబ్బులు ఇవ్వలేదని త‌న తల్లిని హతమార్చాడు.

Crime News: డ‌బ్బుల కోసం క‌న్న త‌ల్లి ప్రాణాలు తీశాడు ఒక కొడుకు. మ‌ద్యం మ‌త్తులో ఆ వ్య‌క్తి ఈ దారుణానికి ఒడిక‌ట్టినట్టు స‌మాచారం. ఈ షాకింగ్ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపుతోంది. కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణ ఘ‌ట‌న ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. 

వివ‌రాల్లోకెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం చింతల నర్వ శివారు చెన్నవరం గ్రామంలో తాగిన మత్తులో కొడుకు తల్లిని హత్య చేశాడు. డ‌బ్బుల కోస‌మే అత‌ను ఈ దారుణానికి పాల్ప‌డిన‌ట్టు స‌మాచారం. పోలీసులు వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. 70 ఏళ్ల దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన మారిడు వెంకమ్మకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మద్యానికి బానిసైన వెంకటేశ్వర్లు 14 ఏళ్ల క్రితం 2006లో తండ్రిని హత్య చేసి నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించాడు. అయినా మార్పు రాకపోవడంతో పాటు మ‌ద్యానికి బానిస‌య్యాడు. ఈ క్ర‌మంలోనే పింఛన్ డబ్బులు ఇవ్వలేదని త‌న తల్లిని హతమార్చాడు. ఈ షాకింగ్ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. ఈ హ‌త్యా ఘ‌ట‌న గురించి మృతుడి కుమార్తె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న‌మోదుచేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న‌పై దర్యాప్తు చేస్తున్నారు.

మహిళపై యాసిడ్ దాది.. 

ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంగళవారం ఓ మహిళ పై యాసిడ్ దాడి జరిగింది. పెడన రామలక్ష్మి కాలనీలో దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మహిళ కరుణ కుమారి తీవ్రంగా గాయపడింది. ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కరుణకుమారిపై యాసిడ్ దాడికి పాల్పడింది రాముడుగా పోలీసులు గుర్తించారు. రాముడి వద్ద కరుణ కుమారి రూ. 20 వేలు అప్పుగా తీసుకుంది. భర్తకు తెలియకుండా ఆమె ఈ అప్పు తీసుకుందని సమాచారం. ఈ డబ్బులు ఆమె తిరిగి ఇవ్వలేదు. ఈ డబ్బుల విషయమై రాముడు బాధితురాలిని వేధిస్తున్నాడు. డబ్బులు ఇవ్వలేదనే అక్కసుతో కరుణకుమారిపై రాముడు యాసిడ్ దాడికి దిగాడని సమాచారం. బాధితురాలు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిని మచిలీపట్టణం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మచిలీపట్టణం ప్రభుత్వాసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతుంది.