Asianet News TeluguAsianet News Telugu

ఏపీ అభివృద్దిపై జగన్ ప్రభుత్వం దగ్గద బ్లూ ప్రింట్ ఏముంది?.. సోము వీర్రాజు

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్దిపై బహిరంగ చర్చకు సిద్దమని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. ఏపీ ఎలా తిరోగమనం చెందుతుందో తాము చెప్తామని తెలిపారు. 

Somu Veerraju Slams YSRCP And TDP over AP Development ksm
Author
First Published May 30, 2023, 1:53 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్దిపై బహిరంగ చర్చకు సిద్దమని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అన్నారు. ఏపీ ఎలా తిరోగమనం చెందుతుందో తాము చెప్తామని తెలిపారు. ఏపీ అభివృద్దికి ప్రధాని మోదీ నేతృత్వంలోని  కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకరించిందని చెప్పారు. అయితే ఈ తొమ్మిదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ వచ్చిన పరిశ్రమల జాబితాను బయటపెట్టాలని అన్నారు. రాష్ట్ర అభివృద్దిపై జగన్ ప్రభుత్వం దగ్గద బ్లూ ప్రింట్ ఏముందని ప్రశ్నించారు. ఏపీలో 40 లక్షల టిడ్కో ఇళ్లకు కేంద్ర ప్రభుత్వం రూ. 50 వేల కోట్లు ఇచ్చిందని చెప్పారు. 

ఆహార భద్రత కింద రాష్ట్రానికి కేంద్రం రూ. 25 వేలు కోట్లు ఇచ్చిందని తెలిపారు. వివిధ పథకాలు, ప్రాజెక్టుల కింద రాష్ట్రానికి కేంద్రం 5 నుంచి 6 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందని చెప్పారు. పలు పథకాలకు ఇచ్చిన నిధులను దారి మళ్లీంచారని ఆరోపించారు. ఏపీని సీఎం జగన్ అన్ని విధాలా దివాళా తీయించారని విమర్శించారు. మట్టి, ఇసుక, మైనింగ్ మాఫియాతో కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఏపీ అభివృద్దిపై టీడీపీ, వైసీపీ నేతలు చర్చకు రావాలని సవాలు విసిరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios