టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే ఆలోచిస్తాం: సోము వీర్రాజు
బీజేపీతో పొత్తు ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు.
అమరావతి: టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. బీజేపీతో పొత్తు ఉందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు.
బుధవారంనాడు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. జనసేన 10వ వార్షికోత్సవ సభలో బీజేపీతో పొత్తు ఉందని పనవ్ కళ్యాణ్ చెప్పాడని ఆయన గుర్తు చేశారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని పవన్ కళ్యాణ్ చెప్పలేదన్నారు.
గత కొంతకాలంగా టీడీపీకి ,జనసేన దగ్గరౌతుందనే ప్రచారం సాగుతుంది. అయితే నిన్న జరిగిన జనసేన వార్షికోత్సవ సభలో బీజేపీతో పొత్తు ఉందనే విషయంపై ఆయన స్పందించారు.
భీమవరంలో నిర్వహించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా భావసారుప్యత గల పార్టీలతో కలిసివెళ్లాలని బీజేపీ నిర్ణయం తీసుకొంది . జనసేనను బీజేపీ మిత్రపక్షంగా ఉన్నప్పటికీ భావసారూప్యత ఉన్న పార్టీలతో కలిసి వెళ్తామని బీజేపీ రాజకీయ తీర్మానం చర్చకు కారణమైంది.
వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించేందుకు విపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన అవసరాన్ని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారు బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై పవన్ కళ్యాణ్ అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం కూడా లేకపోలేదు.
బీజేపీ నుండి బయటకు వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ గతంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన, బీజేపీ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్నారు. సోము వీర్రాజు వైఖరే ఇందుకు కారణమనే అభిప్రాయాలను ఆయన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.