విశాఖపట్నంలోని సీతకొండ టూరిజం స్పాట్‌కు వైఎస్సార్ వ్యూ పాయింట్‌గా నామకరణం చేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు తెలిపారు.


విశాఖపట్నంలోని సీతకొండ టూరిజం స్పాట్‌కు వైఎస్సార్ వ్యూ పాయింట్‌గా నామకరణం చేయడాన్ని తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు తెలిపారు. సొంత ఆస్తులకు, భవనాలకు పెట్టుకోవాల్సిన పేర్లను ప్రభుత్వ ఆస్తులకు పెట్టడమేమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులకు ఎంతోకాలంగా ఉన్న పేర్లను తీసేసి ఆయన తండ్రి పేరు పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించడాన్ని ఖండిస్తున్నట్టుగా చెప్పారు. సీఎం జగన్ ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపహంరించుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ తండ్రి పేరును వారి ఆస్తులకు, లోటస్ పాండ్‌కు పెట్టుకోవాలని అన్నారు. 

విశాఖపట్నంలో తమ పార్టీ శ్రేణుల అక్రమ గృహ నిర్బంధాన్ని అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్టుగా చెప్పారు. ఇలాంటి అనాలోచిత నిర్ణయాన్ని ముఖ్యమంత్రి వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ మేరకు సోము వీర్రాజు ట్విట్టర్‌లో వీడియో పోస్టు చేశారు. 

Scroll to load tweet…


ఇక, ఇటీవల బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ మీడియాతో మాట్లాడుతూ.. సీతకొండ వ్యూ పాయింట్ పేరు వైఎస్సార్ వ్యూ పాయింట్‌గా మార్చడం సరికాదన్నారు. వైఎస్సార్ వ్యూ పాయింట్ అంటూ పెట్టిన పేరును వెంటనే మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఏపీలో అరాచక పాలన సాగుతుందని విమర్శించారు.