Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్సీకే రాజీనామా చేశా, 15రోజుల మంత్రి పదవికోసం.. : మంత్రి సోమిరెడ్డి

రెండేళ్ళు ఉన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన వ్యక్తినా అలాంటిది 15 రోజుల మంత్రి పదవి కోసం ఆలోచిస్తానా అంటూ వ్యాఖ్యానించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తమదని ఆపద్ధర్మ ప్రభుత్వం కాదన్నారు. ప్రస్తుతం సమీక్షలు చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు. 
 
somireddy chandramohan reddy comments on reviews
Author
Amaravathi, First Published May 3, 2019, 7:52 PM IST

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై  ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. మే 23 తర్వాత వైసీపీ నేతల నోళ్లు మూతపడతాయంటూ వ్యాఖ్యానించారు. అమరావతిలో వ్యవసాయ శాఖపై రివ్యూ నిర్వహించారు సోమిరెడ్డి.

రెండేళ్ళు ఉన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన వ్యక్తినా అలాంటిది 15 రోజుల మంత్రి పదవి కోసం ఆలోచిస్తానా అంటూ వ్యాఖ్యానించారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తమదని ఆపద్ధర్మ ప్రభుత్వం కాదన్నారు. ప్రస్తుతం సమీక్షలు చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు. 

కేబినెట్ సమావేశాలు కూడా పెట్టుకోవచ్చన్నారు. వైసీపీ నేతలకు ఏమైనా డౌట్లు ఉంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చదుకోవాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యలు వచ్చినపుడు తాము నిర్ణయాలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. భారతరాజ్యాంగం ప్రకారం ఎన్నికలు పూర్తైనా కానీ ప్రభుత్వానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. 

తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని కేర్ టేకర్ ప్రభుత్వం కాదని సోమిరెడ్డి తెలిపారు. ఎలక్షన్ కమిషన్ తన సమీక్షను అడ్డుకుంటే రాజీనామా చేస్తానని చెప్పాను కానీ ఈసీ తన సమీక్షని అడ్డుకోలేదన్నారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. 

Follow Us:
Download App:
  • android
  • ios