Asianet News TeluguAsianet News Telugu

హైలెవల్ కెనాల్ ఫేస్ II శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు..

సోమశిల హైలెవల్ కెనాల్ ఫేస్ II నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వై.స్ జగన్ ఈ నెల 9న ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. మర్రిపాడు మండలం కృష్ణాపురం గ్రామంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి , ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొంటారు.

Somalia High-Level Canal Phase II works starts on Nov 9th - bsb
Author
hyderabad, First Published Nov 6, 2020, 3:46 PM IST

సోమశిల హైలెవల్ కెనాల్ ఫేస్ II నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వై.స్ జగన్ ఈ నెల 9న ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేయనున్నారు. మర్రిపాడు మండలం కృష్ణాపురం గ్రామంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి , ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొంటారు.

ఈ నేపథ్యంలో రెవెన్యూ, ఇంజనీరింగ్,  పోలీస్ అధికారులతో కలిసి మంత్రి OSD చెన్నయ్య నేడు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 648 కోట్ల రూపాయలతో చేపడుతున్న హైలెవల్ కెనాల్ ఫేజ్ II నిర్మాణం వలన ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లోని మెట్ట ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని, అలాగే తాగు నీటి అవసరాలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని, వలసలు నివారించ వచ్చని తెలిపారు. 

ముఖ్యంగా ఈ హైలెవల్ కెనాల్ మంజూరులో మాజీ పార్లమెంట్ సభ్యులు రాజ మోహన్ రెడ్డి విశేష కృషి చేశారన్నారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి సువర్ణమ్మ, సర్కిల్ ఇన్స్పెక్టర్ సోమయ్య, హై లెవెల్ కెనాల్ DEE మురళీకృష్ణ,  మండల స్థాయి అధికారులు మరియు వైఎస్ఆర్సిపి నాయకులు పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios