వెంకటగిరిలో ఓ వివాహానికి హాజరయ్యేందుకు చెన్నై నుంచి వచ్చిన అతడు నాయుడుపేటలో తన స్నేహితుడి వద్ద మోటారు సైకిల్‌ తీసుకుని బయలుదేరాడు. మార్గమధ్యంలో అత్తివరం వద్దకు వచ్చేసరికి రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఎదురుగా వస్తున్న టిప్పర్‌ లారీ ఢీకొంది.

రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దుర్మరణం చెందిన సంఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది. బైక్ పై వెళుతుండగా.. టిప్పర్ లారీ వచ్చి గుద్దింది. దీంతో తీవ్రగాయాలపాలై మృతిచెందారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వినాయకపురం గ్రామానికి చెందిన వెంకటసుబ్బయ్య(32) చెన్నైలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వెంకటగిరిలో ఓ వివాహానికి హాజరయ్యేందుకు చెన్నై నుంచి వచ్చిన అతడు నాయుడుపేటలో తన స్నేహితుడి వద్ద మోటారు సైకిల్‌ తీసుకుని బయలుదేరాడు. మార్గమధ్యంలో అత్తివరం వద్దకు వచ్చేసరికి రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఎదురుగా వస్తున్న టిప్పర్‌ లారీ ఢీకొంది.

 దీంతో వెంకటసుబ్బయ్య లారీ చక్రాలకింద పడి నుజ్జునుజ్జుయ్యాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న ఎస్‌ఐ తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శుక్రవారం పంచనామా నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.