గుంటూరు జిల్లా మంగళగిరిలో వున్న ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో బుధవారం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది, ఇతర ఉద్యోగులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. 

గుంటూరు జిల్లా మంగళగిరిలో వున్న ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో బుధవారం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఆఫీసులో వున్న బ్యాటరీలు లీకై పొగలు వ్యాపించాయి. దీంతో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది, ఇతర ఉద్యోగులు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. అనంతరం భయంతో కార్యాలయం నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred