తిరుమల ఘాట్ రోడ్డులో  ఇవాళ  జరిగిన  రోడ్డు ప్రమాదంలో  ఆరుగురు గాయపడ్డారు. సంఘటన స్థలంలో  ఎస్పీఎఫ్  సిబ్బంది  సహాయక  చర్యలు చేపట్టారు. 


తిరుమల: తిరుమల ఘాట్ రోడ్డులో బుధవారంనాడు రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమల నుండి తిరుపతికి ఎలక్ట్రిక్ బస్సు వెళ్లున్ సమయంలో ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డులో డివైడర్ ను ఢీకొని బస్సు బోల్తా పడింది. 

ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులకు గాయాలయ్యాయి. గాయపడిన భక్తులను రుయా ఆసుపత్రికి తరలించార. మరో వైపు సంఘటన స్థలంలో ఎస్‌పీఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 29 మంది ప్రయాణీకులున్నారు.

గతంలో కూడ తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 14న తిరుమల ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు.అనంతపురానికి చెందిన భక్తులు వాహనంలో తిరుమల ఘాట్ రోడ్డు నుండి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. స్పీడ్ గా ఉన్న వాహనం అదుపు తప్పింది. ఈ ప్రమాదం లో వాహనంలో ఇద్దరు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్ 23న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగరు ప్రయాణీకులు గాయపడ్డారు. ఈ ఏడాది మార్చి మాసంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భక్తులు గాయపడ్డారు.