Asianet News TeluguAsianet News Telugu

బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి: వెల్లంపల్లికి 150 పేజీల నివేదిక అందించిన శివస్వామి

 బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక విషయమై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పీఠాధిపతి ఎంపిక విషయమై విజయవాడకు చెందిన శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి నేతృత్వంలో పీఠాధిపతులు కడపకు వెళ్లి గ్రామస్తులతో పాటు  ఇతరులతో చర్చించి తయారు చేసిన 150పేజీల నివేదకను మంగళవారం నాడు మంత్రికి అందించారు. 

siva Swamy submits 150 pages report to minister Vellampalli srinivas lns
Author
Kadapa, First Published Jun 22, 2021, 1:28 PM IST

విజయవాడ: బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపిక విషయమై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పీఠాధిపతి ఎంపిక విషయమై విజయవాడకు చెందిన శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి నేతృత్వంలో పీఠాధిపతులు కడపకు వెళ్లి గ్రామస్తులతో పాటు  ఇతరులతో చర్చించి తయారు చేసిన 150పేజీల నివేదకను మంగళవారం నాడు మంత్రికి అందించారు. 

also read:బ్రహ్మంగారి మఠం వివాదం.. శివస్వామి ఎంపిక చెల్లదు, త్వరలోనే పీఠాధిపతి నిర్ణయం: వెల్లంపల్లి

 బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి విషయంలో వీరభోగవెంకటేశ్వరస్వామి రెండు కుటుంబసభ్యుల వివాదం చోటు చేసుకొంది. మొదటి భార్య పెద్ద కొడుకు  వెంకటాద్రికి    పీఠాధిపతి పదవిని ఇవ్వాలని  కందిమల్లాయపల్లె గ్రామస్తులు  కోరుతున్నారు.  రెండో భార్య మహాలక్ష్మమ్మ మాత్రం తన కొడుకుకే పీఠాధిపతి పదవి ఇవ్వాలని కోరుతున్నారు. చనిపోయే ముందు తన భర్త వీలునామా రాశాడని ఆమె చెబుతున్నారు మొదటి భార్య కొడుకు వెంకటాద్రికే శివస్వామి మద్దతుగా నిలుస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది. పీఠాధిపతులు కందిమల్లాయపల్లె గ్రామానికి రావడంపై ఆమె గతంలో ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేసింది. 

ఇదిలా ఉంటే  ఏపీ దేవాదాయ శాఖ మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాస్ కు శివస్వామి 150 పేజీల నివేదికను అందించారు.  మరోవైపు బ్రహ్మంగారి మఠంలో వీరబోగ వెంకటేశ్వరస్వామి కుటుంబ సభ్యులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పీఠాధిపతిపై చర్చిస్తున్నారు. పీఠాధిపతి నియామకం విషయంలో మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా కుటుంబసభ్యులే చర్చించి నిర్ణయం తీసుకోవాలని మంత్రి సూచించడంతో కుటుంబసభ్యులు సమావేశమయ్యారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios