తన ఇద్దరు కూతుర్లను రెండో భర్తకు అప్పగించిన తల్లి ఘటనలో దారుణమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. గర్భం దాల్చిన పిల్లలకు తల్లే యూ ట్యూబ్ లో చూసి డెలివరీలు చేసింది. 

ఏలూరు : ఏలూరులో సంచలనం సృష్టించిన కన్నకూతుర్లను రెండో భర్త పరం చేసిన మహిళ కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆ మహిళను, రెండో భర్త సతీష్ ను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న పోలీసులకు అవాక్కయ్యే విషయాలు తెలుస్తున్నాయి. ప్రస్తుతం ఇద్దరు కూతుర్లు మళ్లీ గర్భంతో ఉన్నట్లు తెలుస్తోంది. వారిద్దరికీ మొదటిసారి కన్నతల్లి యూట్యూబ్లో చూసి డెలివరీలు చేసిందని సమాచారం. 

అంతేకాదు పెద్ద కూతురుతో పుట్టిన కూతురికి.. తనకు, తన భార్యకు పుట్టిన కూతురిగా సతీష్ బర్త్ సర్టిఫికెట్ తీసుకున్నట్లుగా పోలీసుల విచారణలో వెలుగు చూసింది. వాస్తవాలు వెలుగు చూడడంతో తల్లిని పోలీసులు అరెస్ట్ చేశారు. మారుటితండ్రి మీద పోక్సో కేసు నమోదు చేశారు. 

గురుగ్రామ్ సెక్స్ రాకెట్ ను చేధించిన పోలీసులు.. ఉజ్బెకిస్తాన్ మహిళ అరెస్ట్..

ఇదిలా ఉండగా, ఆంధ్ర ప్రదేశ్ లోని ఏలూరులో ఓ అమానుష ఘటన వెలుగు చూసింది. కన్న కూతుళ్ళ మీద ఓ తల్లి అత్యంత కీచకంగా, నీచంగా ప్రవర్తించింది. తన రెండో భర్తకు వయసుకు వచ్చిన తన కూతుర్లను అప్పగించింది. వారితో పిల్లల్ని కనాలని కోరింది. వింటుంటేనే అత్యంత జుగుస్సాకరంగా ఉన్న ఈ ఘటన ఏలూరు జిల్లా పెదపాడు మండలంలోని ఓ గ్రామంలో వెలుగు చూసింది.

తల్లి ప్రవర్తనతో ఏం చేయాలో తోచని ఆ కుమార్తెలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం బయటికి వచ్చింది.వారి ఫిర్యాదుతో దిశా పోలీసులు ఆ తల్లిని, ఆమె రెండో భర్తను గురువారం నాడు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగిస్తున్నారు. దిశ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఓ మహిళకు ఇద్దరు అమ్మాయిలు. 

పిల్లలు పుట్టిన తర్వాత 2007లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. ఆ తర్వాత కొద్ది రోజులకి భర్త ఏదో అనారోగ్యంతో మృతి చెందాడు. చిన్న వయసులోనే భర్త చనిపోవడంతో మేనత్త కొడుకును రెండో పెళ్లి చేసుకుంది. ఇక్కడ వరకు కథ బాగానే ఉంది. 

ఈ క్రమంలోనే మేనత్త కొడుకు.. తన రెండో భర్త.. పిల్లల కోసం ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. తనకు పిల్లలు కావాలని.. లేదంటే రెండో పెళ్లి చేసుకుంటానంటూ బెదిరించేవాడు. అప్పటికే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవడంతో ఆమెకు ఏం చేయాలో పాలుపోలేదు.

దీంతో అత్యంత దారుణానికి.. మాతృత్వానికి మాయని మచ్చ తెచ్చే ఆలోచనకు తెరతీసింది. తన ఆడపిల్లలు ఇద్దరు యుక్త వయసుకు వచ్చారని చెప్పింది. వేరే పెళ్లి చేసుకోవద్దని.. తన కూతుర్లతోనే పిల్లల్ని కనాలని తన రెండో భర్తను ఒప్పించింది. ఇలా ఇద్దరు కూతుర్లని అతనికి అప్పగించింది. 2017లో పెద్ద కూతురు తల్లి రెండో భర్తతో ఓ ఆడ శిశువుకు జన్మనిచ్చింది.

తర్వాత మగ పిల్లాడు కావాలనుకోవడంతో తన రెండో కూతురిని కూడా.. భర్తకు అప్పగించింది. ఏడాది క్రితం రెండో కూతురికి మగపిల్లాడు పుట్టాడు. పుట్టిన కాసేపటికే చనిపోయాడు. దీంతో ఆ మృతదేహాన్ని వారు ఎలాంటి కర్మకాండలు లేకుండా కాలువలో పడేశారు. ఈ క్రమంలో ఇటీవల ఆ తల్లికి రెండో భర్తతో విభేదాలు వచ్చాయి. దీంతో కూతుర్లను ఊర్లోనే వదిలేసి విశాఖ పట్నంలోని పుట్టింటికి వెళ్లిపోయిందామే.

ఈ సమయంలో చిన్న కుమార్తె తనకు పరిచయం ఉన్న యువకుడితో ఇంట్లో జరుగుతున్నదంతా చెప్పుకుంది. దీంతో ఆ యువకుడు ఆ చిన్నారుల మేనమామకు విషయాన్ని తెలిపాడు. అప్పటివరకు విషయం తెలియని బంధువులంతా షాక్ అయ్యారు. అందరూ కలిసి ఏలూరు కు వచ్చారు. బాధితులు ఇద్దరినీ తీసుకుని దిశా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయించారు. దిశ సీఐ ఇంద్ర కుమార్ వీరి ఫిర్యాదును తీసుకుని… నిందితుల మీద పోక్సో కేసు పెట్టారు.