మాజీ మంత్రి బొత్య సత్య నారాయణ సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు రంగా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. 

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో విజయనగరం జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. పదేళ్లుగా టీడీపీలో ఉంటూ రెండుసార్లు కౌన్సిలర్‌గా, నాలుగేళ్లుగా మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పదవి కొనసాగుతున్న స్థానిక టీడీపీ నేత కాకి రంగ వైసీపీలో చేరుతున్నారు. శుక్రవారం పట్టణంలో జరిగే వైసీపీ విస్తృతస్థాయి సమా వేశానికి హాజరవుతున్న మాజీ మంత్రి బొత్య సత్య నారాయణ సమక్షంలో ఆ పార్టీలో చేరేందుకు రంగా ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. 

ఇన్నేళ్లు టీడీపీ నేతలతో ఫ్లెక్సీలతో కనిపించిన రంగ గురువారం పట్టణంలో నెలకొల్పిన వైసీపీ ఫెక్సీల్లో ప్రత్యక్షం కావడం విశేషం. బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కాకున్నా టీడీపీ ఇన్‌చార్జి భంజ్‌దేవ్‌తో రంగ సన్నిహితంగా మెలిగేవారు. దాంతో ఆయనకు 2014 మున్సిపల్‌ ఎన్ని కస్త ల్లో వైస్‌చైర్మన్‌ పదవి కూడా అనూహ్యంగా దక్కింది. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త గొర్లె మాధవరావు, వైస్‌చైర్మన్‌ రంగ మధ్య ఏడాది కిందట వివాదం నెలకొంది. 

ఆ వివాదం కాస్త పెద్దదిగా మారి.. పార్టీని విడేదాకా దారితీసింది. తనకు పార్టీలో గౌరవం దక్కడం లేదని.. అందుకే వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. మరికాసేపట్లో ఆయన బోత్స సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.