సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి షాక్ తగిలింది. కీలక నేత ఒకరు పార్టీ కి రాజీనామా చేశారు. ఇప్పటి వరకు టీడీపీ, వైసీపీ , కాంగ్రెస్ పార్టీ నేతలు.. తమ పార్టీలకు రాజీనామా లు చేసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. కాగా.. తాజాగా జనసేన కి కూడా ఓ సీనియర్ నేత రాజీనామా చేశారు.

జనసేన పార్టీకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న విజయబాబు రాజీనామా చేశారు. జనసేనలో కీలకంగా వ్యవహరించిన విజయ్‌బాబు ఆపార్టీకి రాజీనామా చేయడం పట్ల పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కాగా... వ్యక్తిగత కారణాల వల్లే తాను రాజీనామా చేస్తున్నట్లు విజయ్‌బాబు వెల్లడించారు. ఇదిలా ఉండగా విజయ్‌బాబు గతంలో ఆర్టీఐ కమిషనర్ గా పనిచేశారు.