టీడీపీ సీనియర్ నేత, శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావుకి మరో షాక్ తగిలింది. ఇప్పటికే కే ట్యాక్స్ వసూళ్ల  కేసు విషయంలో ఆయన, ఆయన కుటుంబసభ్యులు తిప్పలు పడుతూనే ఉన్నారు. తాజాగా మరో ఊహించని షాక్ తగిలింది. 

కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్ కు చెందిన గౌతమ్ హోండా షో రూంని అధికారులు సీజ్ చేశారు. పన్నులు చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఐదేళ్లుగా ఈ దందా కొనసాగుతున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది..

 ఇక కోడెల బినామీ యర్రంశెట్టి మోటార్స్ లో కూడా ట్యాక్స్ లు చెల్లించకుండా 400 వాహనాలను విక్రయించినట్లు గుర్తించారు. దీతో నరసరావుపేట, గుంటూరు లోని రెండు ష రూమ్ లను అధికారులు సీజ్ చేశారు. కే ట్యాక్స్ కేసు కారణంగా... ఇప్పటికే కోడెల  సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతి ఎదురుకుంటున్నారు. ఇప్పుడు మరో వ్యవహారం మెడకు చుట్టుకుంది. మరి దీని గురించి కోడెల ఎలా స్పందిస్తారో చూడాలి.