ఆంధ్రప్రదేశ్‌లో వార్డ్ వాలంటీర్‌పై వేధింపులకు సంబంధించి రోజుకొక ఘటన వెలుగుచూస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో మాజీ కౌన్సెలర్ వేధింపులు భరించలేక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు మహిళా వాలంటీర్లు

ఆంధ్రప్రదేశ్‌లో వార్డ్ వాలంటీర్‌పై వేధింపులకు సంబంధించి రోజుకొక ఘటన వెలుగుచూస్తోంది. తాజాగా నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో మాజీ కౌన్సెలర్ వేధింపులు భరించలేక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు మహిళా వాలంటీర్లు.

కామాంధుడి నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను కోరారు. తన కోరిక తీర్చకపోతే వార్డులో ఉద్యోగం చేయలేరంటూ తమను మాజీ కౌన్సెలర్ బెదిరించాడని వాలంటీర్లు వాపోయారు. లైంగిక వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారు కోరుతున్నారు.