Asianet News TeluguAsianet News Telugu

రంగంపేటలో జల్లికట్టు పోటీల్లో అపశృతి.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు..

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎ రంగంపేటలో జల్లికట్టు పోటీలు ప్రారంభం అయ్యాయి. అయితే ఈ పోటీల్లో అపశృతి చోటచేసుకుంది. ఎద్దులు మీదకు దూసుకురావడంతో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

several injured in Jallikattu Competition in chandragiri in tirupati district
Author
First Published Jan 16, 2023, 2:27 PM IST

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎ రంగంపేటలో జల్లికట్టు పోటీలు ప్రారంభం అయ్యాయి. అయితే ఈ పోటీల్లో అపశృతి చోటచేసుకుంది. ఎద్దులు మీదకు దూసుకురావడంతో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వెంటనే వారిని తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. మరికొందరికి స్వల్పంగా గాయాలు కాగా.. అక్కడే ప్రథమ చికిత్స అందించారు. అయితే ఎద్దులు మీదకు దూసుకొచ్చిన కూడా యువకులు వాటి కొమ్ములకు కట్టిన పలకలను దక్కించేందుకు పోటీ పడ్డారు. కొందరికి గాయాలు అయినప్పటికీ.. మిగిలినవారు మాత్రం వెనకడుగు వేయలేదు. ఇక, ఈ పోటీలను వీక్షించేందుకు భారీగా జనం తరలివచ్చారు. పోలీసులు ఆంక్షలు ఉన్నప్పటికీ జల్లికట్టు పోటీల నిర్వహించేందుకు నిర్వాహకులు వెనక్కి తగ్గలేదు. 

కనుమ పండగ రోజున పశువుల పండగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఆంక్షలు పెట్టినప్పటికీ.. తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని అంటున్నారు. తాము నిర్వహించేంది జల్లికట్టు కాదని.. పశువుల పండగ అని వారు చెబుతున్నారు. ఇక, పోటీల్లో భాగంగా పశువుల కొమ్ములకు పలకలు కట్టి ఇరుకైన దారిలో వదిలారు. పోటీల్లో పాల్గొనే యువత పశువుల కొమ్ములకు కట్టిన పలకలను సొంతం చేసేందుకు ప్రయత్నించారు. 

ఇక, జల్లికట్టు అనే పేరు చెప్పగానే అందరికి ముందుగా తమిళనాడు గుర్తుకు వస్తుంది. అయితే తమిళనాడుకు సరిహద్దుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జల్లికట్టు తరహాలో పశువుల పండుగ జరుగుతుంది. తమిళనాడులో కనుమ రోజు జల్లికట్టు జరుకుంటే.. ఇక్కడ మాత్రం సంక్రాంతి ముందే నుంచే ప్రారంభం అవుతుంది. అయితే తాము నిర్వహించేది జల్లికట్టు కాదని పశువుల పండగ  స్థానికులు చెబుతారు. చాలా ఏళ్ల నుంచి తాము ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios