సారాంశం

దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్..అలనాటి హీరోయిన్ జయచిత్రను రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నారంటూ ఓ స్వచ్ఛంద సంస్థ సంచలన విషయాలు వెలుగులోకి తెచ్చింది. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎన్నికలకు ముందే వేడెక్కుతున్నాయి.  రాజకీయ నాయకులు ఒకరిమీద ఒకరు వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతూ… జనాలను అయోమయంలో పడేస్తున్నారు. ప్రజా సంక్షేమం ఊసెత్తకుండా…దూషణలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన ఓ అంశం ఇప్పుడు వైరల్ గా మారుతుంది. సీక్రెట్ హిస్టరీ డాషింగ్ పొలిటికల్ ఫోర్ట్ నైట్లీ అనే సంస్థ.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద సంచలన ఆరోపణలు చేసింది.

ఇటీవల ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ను నలుగురు భార్యలు అంటూ ఎద్దేవా చేయడం.. ఏ మీటింగులోనైనా పవన్ వివాహాల ప్రస్తావన తీసుకువచ్చి మాట్లాడడం వైసిపి నేతలకు మామూలు విషయమే. ఇటీవల వైఎస్ జగన్ పవన్ కు నలుగురు భార్యలు అంటూ చేసిన వ్యాఖ్యల తరువాత ఈ హీట్ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే వైయస్ రాజశేఖర్ రెడ్డి రెండో పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం చెబుతూ ఈ సంస్థ వెలుగులోకి తెచ్చిన అంశాలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కుదుపుకు దారితీస్తోంది.

ఆ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ..  దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గురించి.. ఏ దినపత్రిక ఏ టెలివిజన్ ఛానలూ… చూపించని విషయం ఒకటి చెబుతానంటూ చెప్పుకొచ్చారు. ఈ విషయం అది కొద్ది మందికి మాత్రమే తెలుసు అన్న భయంకర నిజాన్ని బయటపెడుతున్నాను అన్నారు. అలనాటినటి హీరోయిన్ జయచిత్ర ఫోటోను చూపిస్తూ.. ఈమె సినీనటి అన్న విషయం అందరికీ తెలుసు. చాలామంది రాజకీయ నేతలకు కూడా ఆమె తెలుసు.

ఆమెకు పెళ్లయింది. భర్త, కొడుకు ఉన్నారు. అయితే దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి ఈమెను బలవంతంగా మళ్లీ పెళ్లి చేసుకున్నారు.  అప్పటికే ఆయనకి విజయమ్మతో వివాహమై, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమెకు పెళ్లై.. భర్త, బాబు ఉన్నాడు. అయినా కూడా ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకుని చెన్నైలో కాపురం పెట్టాడు. ఆమెను భర్తతో కాపురం చేయనీయలేదు. అంటూ సంచలన విషయాలను బయటపెట్టారు సీక్రెట్ హిస్టరీ డాషింగ్ పొలిటికల్ ఫోర్ట్  నైట్లీ ప్రతినిధి.

అతను వైయస్ జగన్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.. నటి జయచిత్రతో వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఉన్న అక్రమ సంబంధం నిజం కాదా? అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి రెగ్యులర్ గా చెన్నైకి ఎందుకు వెళ్లేవారు? ఆ విషయం నీకు తెలుసు.. నీ చెల్లికి తెలుసు.. మీ అమ్మకు కూడా తెలుసు. మీ బంధువులందరికీ తెలుసు.. మీడియాలో కూడా చాలామందికి తెలుసు. కానీ దాన్ని ఎవరూ బహిర్గతం చేయరు.. ఎక్కడా రాయరు,  ఏ ఛానల్ లోనూ చూపించరు.. అని ఆ సీక్రెట్ హిస్టరీ  ప్రతినిధి అన్నారు.

ఎందుకంటే జయచిత్ర భర్తకు విడాకులు ఇవ్వలేదు వైయస్ రాజశేఖర్ రెడ్డి తన భార్య విజయమ్మకు విడాకులు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. విమాన ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత వైయస్ జగన్ చేసిన మొదటి ఫోను జయచిత్రకే. మా నాన్న చనిపోయాడని మీరు రావద్దు. అందరి ముందు బొట్టు తీసేసి, గాజులు పగులు కొట్టి హంగామా చేయకండి. మీకు, మీ కొడుకుకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటా…నా తండ్రికి నువ్వు రెండో భార్య అని చెప్పకూడదని బెదిరించాడు.  

అందుకే ఆమె బయటికి రాలేదు. చనిపోయినప్పుడు చూడడానికి కూడా రాలేదు అని సీక్రెట్ హిస్టరీ ప్రతినిధి మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. భర్తను బెదిరించి మీ నాన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి బలవంతంగా కాపురం చేశాడు. ఈ విషయం నీకు, మీ నాన్న ఆత్మకు కూడా తెలుసు అంటూ ఆయన చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు రాజకీయ, సినీవర్గాల్లో చర్చకు దారితీసాయి.