ఏలూరులో ప్రభుత్వ సంక్షేమహాస్టల్ ఓ నాలుగో తరగతి విద్యార్థిని సీనియర్ విద్యార్థులే దారుణంగా హత్యచేశారు. పాత గొడవల నేపథ్యంలో ఈ దారుణానికి ఒడిగట్టారు.
ఏలూరు : రెండు రోజుల క్రితం ఏలూరు జిల్లాలోని ఓ గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహంలో నాలుగో తరగతి విద్యార్థి హత్యకు గురైన సంగతి కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ విద్యార్థిని హత్య చేసింది సీనియర్ విద్యార్థులు అని పోలీసులు తేల్చారు. 48 గంటలలోనే ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను అరెస్టు చేశారు. ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఈ మేరకు వివరాలను గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు.
గోగుల అఖిల్ వర్ధన్ రెడ్డి బుట్టాయిగూడెం మండలం ఉర్రింక గ్రామానికి చెందిన విద్యార్థి. అతను పులి రామన్నగూడెం లోని గిరిజన సంక్షేమ శాఖ వసతి గృహంలో ఉంటున్నాడు. అక్కడే నాలుగో తరగతి చదువుతున్నాడు. జులై 10వ తేదీ అర్ధరాత్రి హాస్టల్లో నిద్రిస్తున్న ఆ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.
నాలుగో తరగతి విద్యార్థి దారుణ హత్య.. అర్థరాత్రి హతమార్చిన గుర్తు తెలియని దుండగులు...
విషయం గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ యాజమాన్యానికి సమాచారం అందించడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడి మెడ నులిమి, పీకనొప్పి, కళ్ల మీద గుద్ది చంపినట్లు ఆనవాళ్లు ఉండడం గమనించారు.. అతడి చేతిలో ఓ లేక కూడా పెట్టారు.
దీని మీద కేసు నమోదు చేసుకున్న బుట్టాయిగూడెం పోలీస్ స్టేషన్ పోలీసులు.. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు ప్రారంభించారు. వీరి దర్యాప్తులో అదే హాస్టల్లో ఉంటున్న సీనియర్ విద్యార్థులు.. పాత గొడవల నేపథ్యంలోని.. అఖిల్ ని హత్య చేసినట్లుగా విచారణలో తేలింది. దీంతో ఈ దారుణానికి పాల్పడిన నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిని జువ్వనైల్ హోమ్కు తరలించారు. ఈ మేరకు ఎస్పీ వివరాలు వెల్లడించారు.
ఇదిలాఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం లో ఓ దారుణ హత్య వెలుగు చూసింది. నాలుగో తరగతి విద్యార్థి హత్యకు గురయ్యాడు. పులిరామన్న గూడెంలోని గిరిజన సంక్షేమ హాస్టల్లో ఉంటున్న ఈ విద్యార్థి హత్య స్థానికంగా కలకలం సృష్టించింది. విద్యార్థి పేరు గోగుల అఖిల్ (9). హాస్టల్లో ఉంటూ నాలుగో తరగతి చదువుతున్నాడు. ఆ చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.
సోమవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత అఖిల్ ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ చిన్నారిని ఎవరు.. ఎందుకు హత్య చేశారో… అంత చిన్నారి మీద పగ ఏమిటో కారణాలు తెలియాల్సి ఉంది. విద్యార్థి హత్య జరిగినట్లు గమనించిన హాస్టల్ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసులకు విషయాన్ని తెలియజేశారు.
బాలుడి చేతిలో ఉత్తరం ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఉత్తరంలో ఏముందో ఇంకా వెలుగు చూడలేదు. బాలుడి ఒంటి మీద ఎలాంటి గాయాలు లేవని పోలీసులు చెబుతున్నారు. దీంతో బయటి వ్యక్తులు హత్య చేశారా? విద్యార్థే ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
