Asianet News TeluguAsianet News Telugu

ఏపీ కొత్త సీఎస్ గా ఆదిత్య నాధ్ దాస్.. పదవీ స్వీకరణ..

ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాథ్ దాస్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 3.15నిమిషాలకు ఆదిత్య నాధ్ దాస్ బాధ్యతలు స్వీకరిస్తారు. 

Senior IAS officer Aditya Nath Das to take charge as new Chief Secretary of Andhra Pradesh today - bsb
Author
Hyderabad, First Published Dec 31, 2020, 9:50 AM IST

ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాథ్ దాస్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 3.15నిమిషాలకు ఆదిత్య నాధ్ దాస్ బాధ్యతలు స్వీకరిస్తారు. 

ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా అనేక పేర్లు వినిపించినా చివరికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదిత్యనాథ్ దాస్ కే మొగ్గు చూపారు. ఈ మేరకు డిసెంబర్ 22న ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిపిందే. 

1987 బీహార్ కు చెందిన ఆయన ప్రస్తుతం రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ప్రస్తుతం సీఎస్ గా వ్యవహరిస్తున్న నీలం సాహ్నీ ఈ నెల 31తో పదవీవిరమణ చేయనున్నారు. సాహ్నీ స్థానంలో ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ ను నియమించింది.

సీఎస్ పదవీవిరమణ చేయనున్న నీలం సాహ్నీకి జగన్ సర్కారు సముచిత స్థానం కల్పించింది. ఆమెను సీఎం ముఖ్య సలహాదారుగా నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్య సలహాదారుగా ఆమెకు క్యాబినెట్ మంత్రి హోదా కల్పించనున్నారు. 

తన నూతన బాధ్యతల్లో భాగంగా నీలం సాహ్నీ ఆరోగ్యం, కోవిడ్ మేనేజ్ మెంట్, రాష్ట్ర-కేంద్ర సంబంధాలు, విభజన అంశాలు, పాలనా పరమైన సంస్కరణలు వంటి అంశాలను పర్యవేక్షిస్తారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios