సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సహానీ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. కేంద్ర సాంఘిక సంక్షేమశాఖ నుంచి ఆమెను ఆంధ్రప్రదేశ్‌కు రిలీవ్ చేస్తూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆమెను రిలీవ్ చేయడంతో త్వరంలోనే నీలం సహానీని సీఎస్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. 

నీలం సహాని 1984 బ్యాచ్‌కు చెందిన ఐఎఎస్ అధికారి. సమీర్ శర్మ 1985 బ్యాచ్ అధికారి. సమీర్ శర్మ ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. నీలం సహాని 2020 జూన్ 30వ తేదీన రిటైర్ కానున్నారు. ఈ ఇద్దరు అధికారుల్లో నీలం సహాని వైపే వైఎస్ జగన్ మొగ్గు చూపుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పలు జిల్లాల్లో  కలెక్టర్‌గా నీలం సహాని పనిచేశారు. నల్గొండ జిల్లా కలెక్టర్‌గా సహాని సుదీర్ఘకాలం పనిచేశారు. ఏపీ రాష్ట్రంలో వైద్య,ఆరోగ్య  శాఖతో పాటు పలు కీలకమైన శాఖల్లో నీలం సహాని పనిచేశారు. 

also Read:వైఎస్ జగన్ కు ఝలక్: మోడీతో ఎల్వీ సుబ్రహ్మణ్యం భేటీ తేదీ ఖరారు

సీఎస్ హోదాలో ఎల్ వి సుబ్రహ్మణ్యం సీఎంఓ కార్యాలయ అధికారి అయినటువంటి ప్రవీణ్ ప్రకాష్ కి షోకాజ్ నోటీసు జారీ చేశాడు. 

తర్వాత రాజకీయ పరిణామాలు ఏంటి అనేది పక్కన పెడితే, ప్రవీణ్ ప్రకాష్ ఏకంగా  షోకాజ్ నోటీసు జారీ చేసిన ఎల్ వి సుబ్రహ్మణ్యం ను అప్రాధాన్యమైన మానవ వనరుల శాఖకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేశాడు. 

పరిపాలనలో సహానికి మంచి పట్టుంది. దీంతో ఏపీ రాష్ట్రానికి సీఎస్ గా తీసుకురావాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా సమాచారం. ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. దీంతో నీలం సహానిని సీఎస్ గా నియమించుకొనే విషయమై ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరినట్టుగా సమాచారం.

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా  ఉన్న ఎల్వీ సుబ్రమణ్యాన్ని ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో ఎల్వీ సుబ్రమణ్యం బుధవారం నాడు సీసీఎల్ఏ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ కు బాధ్యతలు అప్పగించారు

ఎల్వీ సుబ్రమణ్యాన్ని బాపట్ల హెచ్‌ఆర్‌డి ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ జనరల్‌గా నియమించింది. అయితే బాపట్ల హెచ్ఆర్‌డి డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు తీసుకోకుండానే  ఎల్వీ సుబ్రమణ్యం సెలవులో వెళ్లారు.

Also Read:సీఎస్‌గా నీలం సహాని వైపు జగన్ మొగ్గు: కేంద్రం చేతుల్లోనే

జీఎడీ ప్రిన్సిపల్ సెక్రటీ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ ఇటీవల కాలంలో బిజినెస్ రూల్స్ మార్చడంతో పాటు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సీరియస్ అయ్యారు. ఈ మేరకు ప్రవీణ్ ప్రకాష్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకే  ప్రవీణ్ ప్రకాష్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్టుగా  సమాచారం.