పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు టౌన్ పోలీసు స్టేషన్‌లోని భారీ పేలుడు చోటుచేసుకుంది. సీజ్ చేసిన బాణాసంచా పేలడంతో మంటలు చెలరేగాయి. 

పార్వతీపురం మన్యం జిల్లాలోని సాలూరు టౌన్ పోలీసు స్టేషన్‌లోని భారీ పేలుడు చోటుచేసుకుంది. సీజ్ చేసిన బాణాసంచా పేలడంతో మంటలు చెలరేగాయి. భారీగా శబ్దం రావడంతో.. చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసు స్టేషన్ వైపు పరుగులు తీశారు. మరోవైపు భారీ పేలుడు సంభవించిన తర్వాత పోలీసులు వెంటనే బయటకు పరుగులు తీశారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే రంగంలోకి దిగింది. ఘటన స్థలంలో మంటలను అదుపు చేసింది. 

ఇక, బాణాసంచాను పోలీసులు రెండు నెలల క్రితం సీజ్ చేసినట్టుగా చెబుతున్నారు. బాణాసంచా పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పేలుడు ధాటికి పోలీసు స్టేషన్ గోడలకు బీటలు వచ్చాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.