తిరుపతి: రెండో భార్యతో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వ్యక్తికి మరో కష్టం వచ్చి పడింది. ఇద్దరు భార్య గుట్టు రట్టయింది. తల్లి రోడ్డు మీద పడి ఏడుస్తుంటే, ఆ నాన్న మనకొద్దమ్మా.. అంటూ అరిచి గీపెట్టిన పాప రోదన గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యక్తిపై రెండో భార్య కూడా కేసు పెట్టింది. తనకు వివాహం కాలేదని చెప్పి తనను పెళ్లి చేసుకున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

మొదటి భార్య ఫిర్యాదుతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత రెండో భార్య ఫిర్యాదు కూడా రావడంతో అది కూడా నమోదు చేసుకున్ారు. దాంతో వెంకటచలపతికి తిప్పలు తప్పేట్లు లేవు. వెంకట చలపతి 13 ఏళ్ల క్రితం సరస్వతిని అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు వారికి ఓ పాప కూడా ఉంది. 

Also Read: ఆ నాన్న మాకొద్దు.. విడాకులిచ్చేయమ్మా..!

కొన్నాళ్లకు అతను మరో యువతికి గాలం వేసి నమ్మించి నెల్లూరుకు చెందిన మయూరిని వివాహం చేసుకున్నాడు.భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చిన మొదటి భార్య అతని మోసాన్ని పసిగట్టింది. రెండో భార్యతో కలిసి వెళ్తున్న అనత్ని రెండు రోజుల క్రితం తిరుపతి ఈస్ట్ పోలీసు స్టేషన్ సమీపంలో పట్టుకోవడానికి ప్రయత్నం చేసింది. 

బైక్ పై రెండో భార్యతో వెళ్తున్న చలపతి మొదటి భార్యను, కూతురిని తోసేసి వెళ్లిపోయాడు. వారు ఎవరో తెలియనట్లు నటించాడు. దాంతో సరస్వతి తన కూతురుతో రోడ్డుపైనే చతికిలపడి విలపించింది. ఆమ్మా.. డాడీని మరిచిపోమ్మా.. విడాకులిచ్చేయ్ అంటూ కూతురు గట్టిగా కేకలు పెడుతూ బోరుమంది. ఈ విషయం మీడియాలో కూడా వచ్చింది. 

దాంతో మహిళ పోలీసులు సరస్వతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ స్థితిలో రెండో భార్య కూడా ముందుకు వచ్చింది. వెంకట చలపతి తనను మోసం చేశాడని కేసు పెట్టింది. తనకు వివాహం కాలేదని నమ్మించి తనను పెళ్లి చేసుకున్నాడని చెప్పింది. తాను ఇప్పుడు గర్భవతిని అంటూ తన గోడు చెబుకుంది. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకున్న వెంకట చలపతి ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు.