Asianet News TeluguAsianet News Telugu

ఆర్మీ ఆస్పత్రిలో రఘురామకృష్ణంరాజుకు రెండో రోజు వైద్య పరీక్షలు..

హైదరాబాద్ : ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సికింద్రబాద్‌లోని తిరుమల గిరి ఆర్మీ ఆస్పత్రిలో రెండో రోజు బుధవారం వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఆర్మీ వైద్యులు బీపీ, షుగర్, బ్లడ్ టెస్ట్‌లు పూర్తి చేశారు. ఆర్మీ ఆస్పత్రిలో ప్రత్యేక గదిలో రాఘురామ విశ్రాంతి తీసుకుంటున్నారు. 

second day medical tests to raghu rama krishnam raju in army hospital secunderabad - bsb
Author
Hyderabad, First Published May 19, 2021, 1:35 PM IST

హైదరాబాద్ : ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు సికింద్రబాద్‌లోని తిరుమల గిరి ఆర్మీ ఆస్పత్రిలో రెండో రోజు బుధవారం వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. ఆర్మీ వైద్యులు బీపీ, షుగర్, బ్లడ్ టెస్ట్‌లు పూర్తి చేశారు. ఆర్మీ ఆస్పత్రిలో ప్రత్యేక గదిలో రాఘురామ విశ్రాంతి తీసుకుంటున్నారు. 

కాగా మరి కొద్ది సేపటిలో మంగళవారం నాడు చేసిన వైద్య పరీక్షల రిపోర్టులు ఆర్మీ వైద్యులకు అందనున్నాయి. రెండో రోజు కూడా ఆర్మీ పోలీసులు వాహనాలు తనిఖీలు చేసి, అనుమతి ఉన్నవారికి మాత్రమే లోపలకి పంపిస్తున్నారు. ఎంపీ రఘురామ కృష్ణంరాజుకు ఆర్మీ ఆస్పత్రిలో హైకోర్టు నియమించిన జ్యుడీషియల్ అధికారి పర్యవేక్షణలో వైద్య పరీక్షలు  కొనసాగుతున్నాయి. 

ఆర్మీ హాస్పిటల్‌కు చెందిన ముగ్గురు వైద్య అధికారుల బృందంతో వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. అధికారులు మొత్తం వీడియో గ్రఫీ చేస్తున్నారు. వైద్య బృందం రఘురామకు ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. నడవలేక పోవడానికిగల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన చెప్పిన సమస్యలపై వైద్యలు పరీక్షలు నిర్వహించనున్నారు. 

సుప్రీం కోర్టు ఆదేశాలతో హైకోర్టు రిజిస్టర్ నాగార్జునను న్యాయధికారిగా నియమించింది. చికిత్స ప్రక్రియ మొత్తం వీడియో గ్రఫీ చేస్తున్నారు. రఘురామ కృష్ణంరాజు చెప్పే స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డ్ చేస్తున్నారు. జ్యూడిషియల్ కష్టడీలో ఉన్న ఎంపీని ఎవరు కలవడానికి వీలులేదు. 

రఘురామకు తొలిరోజు వైద్య పరీక్షలు పూర్తి.. 21న సుప్రీంకోర్టుకు నివేదిక...

ఈ నెల 21వ తేదీ వరకు రఘురామను మిలటరీ ఆస్పత్రిలోనే వైద్య చికిత్సలు చేయనున్నారు. 21 తేదీన ఆయన ఆరోగ్య పరిస్థితి, వీడియో గ్రఫి, స్టేట్‌మెంట్‌ను షీల్డ్ కవర్‌లో పెట్టి న్యాయధికారి సుప్రీం కోర్టుకు అందజేయనున్నారు.

కాగా, మంగళవారం రఘురామకు తొలిరోజు వైద్య పరీక్షలు ముగిశాయి. న్యాయాధికారి సమక్షంలో ఎంపీకి పరీక్షలు నిర్వహించారు. వైద్యపరీక్షలు, ల్యాబ్ రిపోర్టులు వీడియోగ్రఫీ చేసి సీల్డ్ కవర్ లో భద్రపరిచారు. మెడికల్ రిపోర్టులు ఈనెల 21న సుంప్రీంకోరట్ుకు సమర్పించనున్నారు. న్యాయాధికారి తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలోనే రఘురామకృష్ణంరాజు ఉంటారు.

Follow Us:
Download App:
  • android
  • ios