Asianet News Telugu

మద్యం సీసాలో ‘తేలు’..!

 సాధారణంగా కల్తీ మందును చూశాం కానీ.. ఇలా మందులో విషపు పురుగులు ఉండటమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.  

Scorpio in a bottle of alcohol
Author
Hyderabad, First Published Jun 25, 2021, 2:57 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

మద్యం ఆరోగ్యానికి హానికరం.. ఈ విషయం మనకు తెలిసిందే. మద్యం తాగితే.. శరీరంలోని కొన్ని అవయవాలు పాడైపోయి.. వివిధ రకాల జబ్బులు వచ్చి ప్రాణాలు పోతాయని వైద్యులు హెచ్చరిస్తూనే ఉంటారు. అయితే.. ఈ మద్యం తాగితే.. జబ్బులు  చేయడం కాదు.. వెంటనే ప్రాణాలు పోతాయి. ఎందుకంటే.. ఈ మద్యంలో హానికర పదార్థాలతోపాటు.. శరీరంలో విషం ఉన్న తేలు కూడా ఉంది. ఓ మద్యం సీసాలో తేలు కనిపించి.. మందుబాబులందరూ కంగుతినేలా చేసిన సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన పుల్లలచెరువు లోని ప్రభుత్య మద్యంషాపులో గురువారం కొందరు మద్యంప్రియులు "మ్యాన్షన్ హౌస్" బాటిళ్లను కొనుగోలు చేశారు. గ్లాసులు, నీళ్లు, స్టఫ్ తీసుకుని తాగేందుకు సమాయత్తమయ్యారు. తీరా మందుబాటిల్ ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా అందులో విషాపురుగైన తేలు  కనిపించింది. దీంతో సదరు మందుబాబులు అవాక్కయ్యారు. 

తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సాధారణంగా కల్తీ మందును చూశాం కానీ.. ఇలా మందులో విషపు పురుగులు ఉండటమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.  రూ.150, 200 లకు "స్పెషల్ స్టేటస్", "గోల్డ్ మెడల్" , "ప్రషిడెంట్ మెడల్" వస్తున్నాయి కానీ ఇలా విషపురుగు లతో మద్యం బాటిళ్లు సీల్ తో సహా రావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సంబందిత అధికారులు ఈ ఘటనపై విచారణ చేపట్టి, తగుచర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

Follow Us:
Download App:
  • android
  • ios