అంబేడ్కర్ కొనసీమ జిల్లా అమలాపురం బండారు లంక‌లోని ఓ స్కూల్‌లో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

అంబేడ్కర్ కొనసీమ జిల్లా అమలాపురం బండారు లంక‌లోని ఓ స్కూల్‌లో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పలువురు విద్యార్థులు స్పృహ తప్పి పడిపోయారు. పాఠశాలకు సమీపంలో ప్లాస్టిక్ వ్యర్థాలకు నిప్పుపెట్టడంతో.. వెలువడిన పొగతో ఊపిరాడక విద్యార్థులు ఉక్కిరిబిక్కరి అయ్యారు. స్పృహ తప్పిన విద్యార్థులను వెంటనే అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రికి చేరుకుని తమ వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటున్నారు. ఇక, ప్రస్తుతం విద్యార్థులకు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది.