ఏపీ న్యాయవాద సంఘానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఉమ్మడి హైకోర్టు విభజనపై న్యాయవాదులు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మౌలిక వసతులు కల్పించడకుండానే హైకోర్టును విభజించారంటూ ఏపీ న్యాయవాదుల వేసిన పిటిషన్‌పై జస్టిస్ సిక్రి, నజీర్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారించింది. 

ఏపీ న్యాయవాద సంఘానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఉమ్మడి హైకోర్టు విభజనపై న్యాయవాదులు దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మౌలిక వసతులు కల్పించడకుండానే హైకోర్టును విభజించారంటూ ఏపీ న్యాయవాదుల వేసిన పిటిషన్‌పై జస్టిస్ సిక్రి, నజీర్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు.. ఈ విషయంలో ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు భవనంతో పాటు మరికొన్ని నిర్మాణాలు పూర్తికానందున రాష్ట్రపతి జారీ చేసిన ఉమ్మడి హైకోర్టు విభజన నోటిఫికేషన్‌ అమలును వాయిదా వేయాలంటూ ఏపీ న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. మౌలిక వసతులు ఏర్పాటయ్యే వరకు సిబ్బంది, న్యాయవాదులు అమరావతికి మకాంను మార్చేందుకు సిద్ధంగా లేరని వారు పిటిషన్‌లో పేర్కొన్నారు.