అనంతపురం జిల్లాలో ఘోరమైన హత్య జరిగింది. స్నేహలత అనే ఎస్బీఐ ఉద్యోగినిని దుండగులు హత్య చేసి శవాన్ని కాల్చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో దారుణమైన హత్య జరిగింది. ఎస్బీఐ ఉద్యోగిని దుండగులు హత్య చేసి ఆమె శవాన్ని కాల్చేశారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లిలో జరిగింది.
Add Asianetnews Telugu as a Preferred Source

మృతురాలిని స్నేహలతగా గుర్తించారు. ఆమె అనంతపురంలోని ఎస్బీఐలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగినిగా పనిచేస్తోంది. బైక్ మీద ప్రతి రోజూ వెళ్లి వస్తోంది. స్నేహలత కనిపించడం లేదని కుటుంబ సభ్యులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తింపు కార్డు ఆధారంగా ఆమెను గుర్తించారు. ఓ యువకుడిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు ఇప్పటి వరకు తెలియరాలేదు. స్థానికంగా ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.
