గుంటూరు: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మ
ణ సంఘ సమాక్య ప్రధాన కార్యదర్శి కోనూరి సతీష్ శర్మ మండిపడ్డారు. వైఎస్సార్సీపీకి ఓటు వేయడం వెంకన్నకు ద్రోహమే అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించి కోట్లాది మంది వెంకన్న భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని ఆయన అన్నారు 

గుంటూరులోని సమాఖ్య కార్యాలయంలో ఆయన సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడారు పవన్ కల్యాణ్ మాటలు రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన అన్నారు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలోని బ్రాహ్మణులంతా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి బిజెపి, జనసేనలకు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే బ్రాహ్మణులకు గౌరవం, రాజకీయంగా గుర్తింపు లభించాయని ఆయన అన్నారు బిజెపి హిందూత్వం ముసుగులో బ్రాహ్మణులను మోసం చేస్తోందని ఆయన న్నారు 

టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉండగా టీటీడీలో తొలగించిన మిరాశీ అర్చకులనను ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తిరిగి విధుల్లోకి తీసుకున్నారని, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని ఆయన అన్నారు.