Asianet News TeluguAsianet News Telugu

తిరుమలలో వైకుంఠ ఏకాదశి రష్ : సర్వదర్శనం నిలిపివేత.. టోకెన్లు లేనివారికి నో ఎంట్రీ, టీటీడీపై భక్తుల ఆగ్రహం

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం విషయమై గందరగోళం నెలకొంది. శుక్రవారం టికెట్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చిన భక్తులను క్యూలైన్లలోకి అనుమతించకపోవడంతో వివాదం మొదలైంది. వాస్తవానికి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం టోకెన్లు లేకపోయినా సర్వదర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది. 

sarvadarshan devotees are not allowed to enter the tirumala queue lines ksp
Author
First Published Dec 22, 2023, 6:13 PM IST

తిరుమలలో శ్రీవారి సర్వదర్శనం విషయమై గందరగోళం నెలకొంది. శుక్రవారం టికెట్లు లేకుండా సర్వదర్శనానికి వచ్చిన భక్తులను క్యూలైన్లలోకి అనుమతించకపోవడంతో వివాదం మొదలైంది. దీంతో  ఏటీసీ వద్ద టీటీడీ అధికారులతో సిబ్బంది వాగ్వాదానికి దిగారు. అసలే శనివారం వైకుంఠ ఏకాదశి కావడంతో తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇప్పటికే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2, నారాయణ గిరి షెడ్లు నిండిపోవ`డమే గాక.. నారాయణగిరి అతిథి గృహం వరకు క్యూలైన్ చేరుకుంది. ఈ నేపథ్యంలో వైకుంఠ ద్వార దర్శనానికి ఇబ్బందులు కలగకుండా టోకెన్లు లేని భక్తులను అధికారులు అనుమతించలేదు. రేపటి సర్వదర్శన టికెట్లు వున్న వారిని మాత్రం సాయంత్రం క్యూ లైన్‌లలోకి పంపుతామని టీటీడీ తెలిపింది. 

వాస్తవానికి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం టోకెన్లు లేకపోయినా సర్వదర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది. అయితే భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో టోకెన్లు లేనివారిని అడ్డుకుంది. వైకుంఠ ద్వారా ప్రవేశాల కోసం తిరుపతిలో 9 కేంద్రాలను టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి టోకెన్లను జారీ చేస్తామని ప్రకటించగా.. భక్తుల రద్దీ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి నుంచే వైకుంఠ ద్వార దర్శన టోకెన్లను పంపిణీ చేయడం ప్రారంభించారు. ఈ టికెట్లను ప్రత్యేక రంగుల్లో టీటీడీ ముద్రించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios