ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగం డెయిరీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమ కీలక సర్వర్లు హ్యాకింగ్ కు గురయినట్లు సంగం ఐటీ విభాగం గుర్తించింది. ఇప్పటికే సర్వర్ల యాక్సిస్‌పై ఇప్పటికే ఏసీబీ అధికారులు- సంగం యాజమాన్యం మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.

ప్రైవేటు వ్యక్తులను సర్వర్ రూమ్‌ల్లోకి అనుమతిచడంపై గతంలోనే సంగం అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రైవేటు వ్యక్తులను అడ్డుకున్న రెండో రోజే హ్యాకింగ్ విషయం బయటపడటం కలకలం రేపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సర్వర్ రూంల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

Also Read:జీవో కొట్టివేత: సంగం డెయిరీపై జగన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

ఇది ప్రభుత్వం వెనుక ఉండి నడిపిస్తున్న కుట్ర అంటూ సంగం యాజమాన్యం ఆరోపించింది. సర్వర్లలో కీలక డేటా కోసం పోలీసుల ఒత్తిడి చేస్తున్నారంటూ వ్యాఖ్యానించింది. హ్యాకింగ్‌ను అడ్డుకోవడంపై ఏకంగా ఫోన్లు చేసి ఐటీ సెల్ వారిని బెదిరిస్తున్నారు సంగం యాజమాన్యం ఆరోపించింది.

తనిఖీలకు సంబంధించి కోర్ట్ ఉత్తర్వులు తమకు అందలేదని పోలీసులు చెబుతున్నారు. సర్వర్ల విషయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు యాజమాన్యం ఆరోపించింది. మరోవైపు పోలీసులు సర్వర్లను తరలించే ప్రయత్నంలో వున్నట్లుగా తెలుస్తోంది.

ఇప్పటికే ఏసీబీ , ఇతర పోలీసులు సర్వర్ రూమ్ వద్దకు చేరుకుని సంగం ఉద్యోగులతో వాగ్వివాదానికి దిగారు. అయితే కోర్ట్ ఆర్డర్స్ రాక ముందే సర్వర్లను తరలించేందుకు పోలీసులు యత్నిస్తున్నారని యాజమాన్యం ఆరోపించింది.