విజయవాడ: విజయవాడ గ్యాంగ్ వార్ లో మరో ట్విస్ట్ చోటు చేసుకొంది. పక్కా ప్లాన్‌తోనే తన భర్తను హత్య చేశారని సందీప్ భార్య తేజస్విని ఆరోపించారు.

గురువారం నాడు ఓ తెలుగు న్యూస్ చానెల్‌కి ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె పలు ఆరోపణలు చేశారు.హత్యకు ముందు రోజే సందీప్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని ఆమె చెప్పారు. 

మాట్లాడుకొందాం రావాలని కోరుతూ హత్య చేశారని తేజస్విని చెప్పారు.ల్యాండ్ సెటిల్‌మెంట్ గొడవకు సందీప్‌కు సంబంధం లేదన్నారు. సందీప్ హత్యపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. 

పడమటకి పిలిపించి పక్కా ప్రణాళికతో తన భర్తను హత్య చేశారని ఆమె ఆరోపించారు. పండు, ప్రభు, ప్రశాంత్, రవితేజలు కలిసి తన భర్తను హత్య చేశారని ఆమె ఆరోపించారు. తన భర్త మృతికి కారణమైన వారందరికి శిక్ష పడాలన్నారు.

విజయవాడలో సందీప్, పండు గ్యాంగ్ ల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఈ గొడవలో సందీప్ మరణించారు.  ఈ గ్యాంగ్ వార్ కు సంబంధించి పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ రెండు గ్యాంగ్ ల వెనుక ఎవరెవరున్నారనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనను ఏపీ డీజీపీ సవాంగ్ సీరియస్ గా తీసుకొన్నారు. 

పండుకు ప్రతి ఏడాది వినాయకచవితికి వినాయక విగ్రహం ఇచ్చేవారు. తనకు కూడ కార్పోరేటర్ టిక్కెట్టు ఖరారైందని తేజస్విని చెప్పారు.సందీప్ ను హత్య చేయడం పండు ఒక్కడి వల్లే సాధ్యం కాదని తేజస్విని చెప్పారు. అన్నా అన్నా అంటూ పండు అనే వ్యక్తి వెనుక రాజకీయనేతలు ఉన్నారని ఆమె ఆరోపించారు.