సాలూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live
సాలూరు నియోజకవర్గం పరిధిలో సాలూరు, పాచిపెంట, మెంటాడ,మక్కువ మండలాలున్నాయి. గిరిజన ఓటర్లతో వుండే ఈ సెగ్మెంట్.. ఎస్టీ రిజర్వ్‌డ్. గిరిజన, కాపు, కొప్పుల వెలమ, దళితులతో పాటు నాగవంశం కులాలు అభ్యర్ధుల గెలుపొటములను ప్రభావితం చేస్తున్నాయి. సాలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ పార్టీ ఐదు సార్లు, కాంగ్రెస్ మూడు సార్లు, స్వతంత్రులు, వైసీపీ రెండేసి సార్లు, కృషికార్ లోక్ పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, సీపీఐలు ఒక్కోసారి సాలూరులో విజయం సాధించాయి. రాజన్న దొర 2009 నుంచి 2019 వరకు వరుసగా గెలిచి హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. సాలూరుపై పట్టు కోల్పోకూడదని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో వున్నారు. బలమైన నేత , ప్రస్తుత డిప్యూటీ సీఎం రాజన్న దొరకు మరోసారి టికెట్ కేటాయించారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా గుమ్మడి సంధ్యారాణిని ప్రకటించారు.
ఉమ్మడి విజయనగరం జిల్లా సాలూరు రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే విలక్షణమైనది. గిరిజన ఓటర్లతో వుండే ఈ సెగ్మెంట్.. ఎస్టీ రిజర్వ్‌డ్. సాలూరు నియోజకవర్గం పరిధిలో సాలూరు, పాచిపెంట, మెంటాడ,మక్కువ మండలాలున్నాయి. 2009లో నియోజకవర్గాల పునర్విభజన సందర్భంగా సాలూరు, మక్కువ మండలాలు పూర్తిగా సాలూరు పరిధిలోకి వచ్చాయి.
ఈ సెగ్మెంట్ పరిధిలో గిరిజన, కాపు, కొప్పుల వెలమ, దళితులతో పాటు నాగవంశం కులాలు అభ్యర్ధుల గెలుపొటములను ప్రభావితం చేస్తున్నాయి. పత్తి, వరి , చెరకు, మొక్కజోన్న, ఆయిల్ పామ్ పంటలను ఇక్కడి రైతులు సాగుచేస్తున్నారు. సాలూరులో మొత్తం ఓటర్ల సంఖ్య 1,88,217 మంది. వీరిలో పురుషుల సంఖ్య 92,999 మంది.. మహిళలు 95,207 మంది. కుల ధృవీకరణ కేసులు.. కోర్టు తీర్పులు సాలూరులో ఆనవాయితీగా వస్తున్నాయి.
సాలూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. టీడీపీకి కంచుకోట :
సాలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ పార్టీ ఐదు సార్లు, కాంగ్రెస్ మూడు సార్లు, స్వతంత్రులు, వైసీపీ రెండేసి సార్లు, కృషికార్ లోక్ పార్టీ, ప్రజా సోషలిస్ట్ పార్టీ, సీపీఐలు ఒక్కోసారి సాలూరులో విజయం సాధించాయి. రాజన్న దొర 2009 నుంచి 2019 వరకు వరుసగా గెలిచి హ్యాట్రిక్ సొంతం చేసుకున్నారు. 2009లో కాంగ్రెస్ తరపున విజయం సాధించిన ఆయన.. 2014, 2019లలో వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు.
అలాగే రాజేంద్ర ప్రతాప్ భంజ్ దేవ్, బీ రాజయ్యలు కూడా మూడేసి సార్లు ఇక్కడి నుంచి గెలుపొందారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి రాజన్న దొరకు 78,430 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి భంజ్ దేవ్‌కు 58,401 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా రాజన్న దొర 20,029 ఓట్ల మెజారిటీతో సాలూరులో హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకుని జగన్ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
సాలూరు శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. రాజన్న దొరకు చెక్ పెట్టగలరా :
2024 ఎన్నికల విషయానికి వస్తే.. సాలూరుపై పట్టు కోల్పోకూడదని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో వున్నారు. బలమైన నేత , ప్రస్తుత డిప్యూటీ సీఎం రాజన్న దొరకు మరోసారి టికెట్ కేటాయించారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి , సంక్షేమ కార్యక్రమాలు తనను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ విషయానికి వస్తే.. ఒకప్పటి కంచుకోటలో పాగా వేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. టీడీపీ సాలూరులో గెలిచి 20 ఏళ్లు కావొస్తోంది. చివరిసారిగా 2004లో పసుపు జెండా ఇక్కడ ఎగిరింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రబాబు.. తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా గుమ్మడి సంధ్యారాణిని ప్రకటించారు.
- Salur Assembly constituency
- Salur Assembly elections result 2024
- Salur Assembly elections result 2024 live updaetes
- andhra pradesh assembly elections 2024
- ap assembly elections 2024
- bharatiya janata party
- bjp
- chandrababu naidu
- congress
- janasena
- janasena alliance
- pawan kalyan
- tdp
- tdp janasena alliance
- telugu desam party
- ycp
- ys jagan
- ys jagan mohan reddy
- ys sharmila
- ysr congress party
- ysrcp