Asianet News TeluguAsianet News Telugu

ఓటర్ల నమోదు, దొంగ ఓట్లపై వైసీపీ ఫోకస్.. నేతలు, కేడర్‌కు సజ్జల కీలక సూచనలు

రాష్ట్రంలో దొంగ ఓట్ల తొలగింపు, అర్హులైన వారికి ఓటు హక్కు లభించేలా చూడాలని నేతలు, కేడర్‌కు సూచించారు వైసీపీ కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.  శనివారం అన్ని జిల్లాల వైసీపీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, పరిశీలకులు, జేసీఎస్ కోఆర్డినేటర్లతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

sajjala ramakrishna reddy teleconferencing with ysrcp leaders ksp
Author
First Published Aug 12, 2023, 9:18 PM IST

ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో వైసీపీ గట్టి ఫోకస్ పెట్టింది . దీనిలో భాగంగా ఆ పార్టీ కార్యదర్శి , ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం అన్ని జిల్లాల వైసీపీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, పరిశీలకులు, జేసీఎస్ కోఆర్డినేటర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో వైసీపీ మెజారిటీ సాధించే విధంగా పనిచేయాలన్నారు. ప్రతి ఓటర్‌ను పోలింగ్ బూత్‌తో ఓటు వేయించే విధంగా అందరూ సమన్వయంతో పనిచేయాలని సజ్జల పిలుపునిచ్చారు. 

రాష్ట్రంలో దొంగ ఓట్ల తొలగింపు, అర్హులైన వారికి ఓటు హక్కు లభించేలా చూడాలని ఆయన కేడర్‌కు సూచించారు. నియోజకవర్గ పరిశీలకులు, ఇన్‌ఛార్జ్‌లు, ఎమ్మెల్యేలకు సహకారం అందించాలని సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. జేసీఎస్ సచివాలయ కన్వీనర్లు, మండల కన్వీనర్లు, గృహ సారథులు అందరికీ పార్టీ అండగా వుంటుందని, పనిచేసిన వారికి గుర్తింపు వుంటుందని సజ్జల హామీ ఇచ్చారు. విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని ఆయన కోరారు. చంద్రబాబు హయాంలో 60 లక్షల దొంగ ఓట్లు నమోదు చేశారనే ఆరోపణలు వున్నాయని.. వీటిని గుర్తించి ఈసీ దృష్టికి తీసుకెళ్లాలని రామకృష్ణారెడ్డి సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios