Asianet News TeluguAsianet News Telugu

సమస్యలు పరిష్కరిస్తాం.. పీఆర్సీ ఎప్పుడైనా తప్పదు: ఉద్యోగ సంఘాలతో భేటీ అనంతరం సజ్జల

సమస్యలు వుంటే పరిష్కరిస్తామని మంత్రులు ఉద్యోగ సంఘాల నేతలకు వివరించారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala  rama krishna reddy) తెలిపారు. పీఆర్సీ, తదితర సమస్యలపై పీఆర్సీ స్టీరింగ్ కమిటీ మంగళవారం మంత్రుల కమిటీతో సమావేశమైంది.

sajjala ramakrishna reddy comments after prc steering committee
Author
Amaravathi, First Published Jan 25, 2022, 4:39 PM IST

సమస్యలు వుంటే పరిష్కరిస్తామని మంత్రులు ఉద్యోగ సంఘాల నేతలకు వివరించారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala  rama krishna reddy) తెలిపారు. పీఆర్సీ, తదితర సమస్యలపై పీఆర్సీ స్టీరింగ్ కమిటీ మంగళవారం మంత్రుల కమిటీతో సమావేశమైంది. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. చర్చలు జరిగితేనే సమస్య పరిష్కారం అవుతుందని ఆయన అన్నారు. ఉద్యోగులంటే ప్రభుత్వంలో భాగమని సజ్జల స్పష్టం చేశారు. పీఆర్సీ ఎప్పుడైనా తప్పదని ఆయన పేర్కొన్నారు. స్టీరింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. వినతి పత్రం ఇచ్చేందుకే వచ్చామని, చర్చలకు రాలేదని తెలిపారు. ఒక తేదీని నిర్ణయించి మాట్లాడుదామని ప్రభుత్వ కమిటీ చెప్పిందని వారు పేర్కొన్నారు. 

అంతకుముందు పీఆర్సీ సహా ఇతర సమస్యలకు సంబంధించి మంత్రుల కమిటీని ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. 3 కీలక అంశాలతో ఈ మేరకు వినతి పత్రం ఇచ్చారు పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు. ఆశుతోష్ మిశ్రా కమిటీ నివేదికలను బయటపెట్టాలని.. పీఆర్సీ జీవోలను అబయెన్స్‌లో పెట్టాలని, జనవరి నెల పాత పీఆర్సీ ప్రకారం జీతాలను చెల్లించాలని లేఖలో కోరారు. తమ డిమాండ్లను పరిష్కరిస్తే.. చర్చలకు సిద్ధమని లేఖలో తెలిపారు పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులు. 

కాగా.. ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం ఉద్యోగ సంఘాలు.. సమ్మెకు దిగడానికి సిద్దమయ్యాయి. ఈ క్రమంలోనే సోమవారం సచివాలయంలో జీఏడీ కార్యదర్శి శశిభూషణ్ సమ్మె నోటీసు ఇచ్చారు. మరోవైపు  ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులతో కోసం.. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, పేర్నినాని (Perni Nani), ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 

ఈ కమిటీ చర్చలకు హాజరుకావాలని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం పంపింది. అయితే పీఆర్సీ ఉత్తర్వులు రద్దు చేస్తేనే ప్రభుత్వంతో చర్చల విషయం ఆలోచిస్తామని పీఆర్సీ సాధన సమితి తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సోమవారం ఉద్యోగుల కోసం సచివాలయంలో మంత్రుల కమిటీ వేచి చూసినప్పటికీ ఉద్యోగ సంఘాలు చర్చలకు వెళ్లలేదు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం   YS Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios