నంద్యాలలో పోలీసులు కొట్టారని యువకుడి ఆత్మహత్యాయత్నం
నంద్యాల జిల్లా ఆదోనిలో సాయికుమార్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు కొట్టడంతోనే సాయికుమార్ ఆత్మహత్యాయత్నం చేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
నంద్యాల: జిల్లాలోని ఆదోని కల్లుబావికి చెందిన సాయికుమార్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు కొట్టడంతోనే తమ కొడుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా సాయికుమార్ పేరేంట్స్ ఆరోపిస్తున్నారు.
ఆదోనిలోని కల్లుబావికి చెందిన సాయికుమార్ అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఈ విషయమై యువతి పేరేంట్స్ సాయికుమార్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కూతురిని సాయికుమార్ వేధింపులకు గురి చేస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నెల 7వ తేదీన సాయికుమార్ ను పోలీసులు కౌన్సిలింగ్ కోసం పిలిపించారు. అయితే కౌన్సిలింగ్ కోసం పిలిచి సాయికుమార్ పై పోలీసులు దాడి చేశారని పేరేంట్స్ ఆరోపిస్తున్నారు. పోలీసులు కొట్టడంతో సాయికుమార్ ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా బాధితుడి పేరేంట్స్ ఆరోపిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన సాయికుమార్ ను కుటుంబ సభ్యులు కర్నూల్ లోని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.
ఆత్మహత్యలు పరిష్కారం కావు
ప్రతి చిన్న సమస్యకు ఆత్మహత్యలు పరిష్కారం కావు. సమస్యలు వచ్చినప్పుడే వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.కానీ ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచిస్తున్నారు.
జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.